lifestyle

Pista Kulfi : చ‌ల్ల చ‌ల్ల‌ని కుల్ఫీ.. ఇంట్లోనే ఇలా చేసేయండి..!

Pista Kulfi : చాలా మంది స‌హ‌జంగానే ఐస్‌క్రీముల‌ను ఎవ‌రైనా తింటారు. కానీ వెరైటీగా కుల్ఫీల‌ను తినేవారు చాలా త‌క్కువ మంది ఉంటారు. నిజానికి కుల్ఫీలు కూడా ఐస్‌క్రీములలాగే ఉంటాయి. కానీ టేస్ట్ వేరేలా ఉంటుంది. అయితే వీటిని తినేందుకు ఎక్క‌డికో బ‌య‌ట‌కు వెళ్లాల్సిన ప‌నిలేదు. ఇంట్లోనే కుల్ఫీల‌ను చేసుకోవ‌చ్చు. మ‌రి పిస్తాల‌తో కుల్ఫీల‌ను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

పిస్తా కుల్ఫీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పాలు – 1 లీట‌ర్, చ‌క్కెర – 250 గ్రాములు, బ్రెడ్ – ఒక ముక్క (చివ‌ర్లు క‌త్తిరించుకోవాలి), బాదంపప్పు – 20 (నీటిలో నాన‌బెట్టి పొట్టు తీసిన‌వి), పిస్తాప‌ప్పు – అర క‌ప్పు (పొట్టు తీసినవి, ప‌లుకులుగా చేయాలి), యాల‌కులు – 4, కుంకుమ పువ్వు – 2, 3 రెబ్బ‌లు.

Pista Kulfi

పిస్తా కుల్ఫీ త‌యారు చేసే విధానం..

లీట‌ర్ పాల‌ను అర లీట‌ర్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. పాలు చ‌ల్లారాక అందులో చ‌క్కెర‌, బ్రెడ్‌, బాదం ప‌ప్పు పొడి, పిస్తాప‌ప్పు, యాల‌కుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా క‌ల‌పాలి. కుల్ఫీ మౌల్డ్‌లో సిల్వ‌ర్ ఫాయిల్ సెట్ చేయాలి. అందులో ముందుగా క‌లుపుకున్న మిశ్ర‌మం పోయాలి. ఐస్‌క్రీం పుల్ల‌ను పెట్టుకోవాలి. 12 గంట‌ల పాటు కుల్ఫీ మౌల్డ్‌ని డీప్ ప్రిజ్‌లో ఉంచాలి. అంతే.. చ‌ల్ల చ‌ల్ల‌ని పిస్తా కుల్ఫీ త‌యార‌వుతుంది. కుల్ఫీ మౌల్డ్స్‌ను వేడి నీటిలో ముంచితే కుల్ఫీలు సుల‌భంగా బ‌య‌ట‌కు వ‌స్తాయి. వాటిని చ‌ల్ల చ‌ల్లగా ఉన్న‌ప్పుడే తినాలి. అయితే కుల్ఫీ మౌల్డ్స్ ఇంట్లో లేక‌పోతే చిన్న చిన్న గ్లాసుల‌లో ఆ మిశ్ర‌మం పోసి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. దీంతో కుల్ఫీలు రెడీ అవుతాయి. వీటిని అంద‌రూ ఇష్టంగా తింటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM