Phone Next To Head : స్మార్ట్‌ఫోన్లు అనేవి నేటి తరుణంలో మన దైనందిన జీవితంలో ఎలా భాగమయ్యాయో అందరికీ తెలిసిందే. అవి లేకుండా మనం ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాం. ఎంటర్‌టైన్‌మెంట్ మొదలుకొని అనేక పనులను మనం ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల ద్వారానే చేసుకుంటున్నాం. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా వాటి వాడకం వల్ల వచ్చే దుష్పరిణామాలను మనం పట్టించుకోవడం లేదు. మరీ ముఖ్యంగా.. చాలా మంది నిద్రించేటప్పుడు తమ తల పక్కనే లేదా దిండు కింద ఫోన్లను పెట్టి నిద్రిస్తున్నారు. అది మరింత ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఫోన్లు సాధారణంగా 900 మెగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీతో పనిచేస్తాయి. వాటిల్లో ఉండే రిసీవర్ ఆ ఫ్రీక్వెన్సీతో కాల్స్‌ను స్వీకరిస్తుంది. అలాగే మనం కాల్స్ చేసినా అదే ఫ్రీక్వెన్సీతో వెళ్తాయి. అయితే సాధారణంగా పగలంతా ఫోన్ మనతోనే ఉంటుంది. ఇక రాత్రి పూట కూడా మన శరీరం పక్కనే, అందులోనూ ముఖ్యంగా తల పక్కన ఫోన్‌ను పెడితే దాని ద్వారా వెలువడే రేడియో తరంగాలు మనకు హాని చేస్తాయి. ఆ తరంగాల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మన మెదడుపై ప్రభావం పడి అనేక దుష్పరిణామాలు కలుగుతాయి.
నిద్రించేటప్పుడు ఫోన్‌ను తలపక్కన పెట్టి పడుకుంటే దాన్నుంచి వచ్చే రేడియేషన్‌తో నిద్రలేమి, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తల పక్కన ఫోన్‌ను పెట్టుకునే పనైతే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టాలని, అదే కాల్స్ వస్తాయని అనుకుంటే ఫోన్‌ను దూరంగా పెట్టి నిద్రించాలని వైద్యులు చెబుతున్నారు. ఫోన్‌ను తల పక్కన పెట్టి నిద్రించడం వల్ల డిప్రెషన్, ఒత్తిడి, ఇతర మానసిక వ్యాధులు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుందని, కనుక ఆ పనిచేసే వారు ఇకనైనా దాన్ని మానుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…