Junk Food : చూడగానే నోరూరించేలా ఆహార పదార్థాలు ఉంటాయి కనుకనే.. జంక్ ఫుడ్‌కు ఆ పేరు వచ్చింది. ఏ జంక్ ఫుడ్‌ను చూసినా సరే.. ఎవరికైనా నోట్లో నీళ్లూరుతాయి. అబ్బ.. తింటే బాగుండును అనిపిస్తుంది. కానీ మరోవైపు బరువు పెరుగుతామేమో అనే సందేహం కూడా కలుగుతుంది. దీంతో ఇష్టం అనిపించే చిరుతిళ్లకు కూడా కొందరు దూరంగా ఉంటారు. అయితే కింద తెలిపిన సూచనలు పాటిస్తే జంక్ ఫుడ్ తిన్నా కూడా బరువు పెరగకుండా చూసుకోవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంటే..
జంక్ ఫుడ్‌ను వారంలో కనీసం ఒకసారి మాత్రమే తినే అలవాటు చేసుకోండి. ఎందుకంటే వారంలో ఒక్కసారి అంటే.. ఆ ఒక్క రోజు కొంచెం జంక్ ఫుడ్ తింటే మనకు వచ్చే నష్టమేమీ ఉండదు. కానీ ప్రతి 2 రోజులకు ఒకసారి మాత్రం ఆ ఫుడ్ తినకుండా జాగ్రత్త పడండి. వారంలో మీకు నచ్చిన ఏదో ఒక రోజు జంక్ ఫుడ్ తినడం వల్ల మీరు పెద్దగా బరువేమీ పెరగరు. జంక్‌ఫుడ్ లతో ఇచ్చే సాస్‌లను చాలా మంది ఇష్టంగా లాగించేస్తారు. కానీ సాస్‌లు కొద్ది మొత్తంలో తిన్నా మన శరీరంలో అధికంగా క్యాలరీలు చేరుతాయి. కనుక సాస్‌లను తక్కువగా తింటే బరువు పెరగకుండా ఉంటారు.
ఏదైనా జంక్ ఫుడ్ తినేముందు నీళ్లు తాగండి. దీంతో ఆ ఫుడ్‌ను తక్కువగా తింటారు. అందువల్ల బరువు పెరగకుండా చూసుకోవచ్చు. జంక్ ఫుడ్ తినేవారు ఎంత తింటున్నాం అనేది చూడకుండా లాగించేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. తక్కువ మొత్తంలో తినాలి. దీంతో బరువు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. సాధారణంగా జంక్ ఫుడ్ తినేవారు పలు రకాల ఐటమ్స్‌ను ఒకేసారి లాగించేస్తుంటారు. కానీ అలా కాకుండా ఒకే ఐటమ్‌ను కొద్ది కొద్దిగా ఎక్కువ సేపు తినే యత్నం చేయండి. దీంతో చాలా తక్కువ తింటారు. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…