Gas Trouble : మనలో అధిక శాతం మందికి భోజనం చేయగానే విపరీతమైన గ్యాస్ వస్తుంది. పొట్టంతా నిండిపోయిన భావన కలుగుతుంది. కొందరికి వికారం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అయితే ఇందుకు ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారమే అని చెప్పవచ్చు. మనం తీసుకునే పలు ఆహార పదార్థాల వల్ల కూడా గ్యాస్ బాగా వస్తుంది. మరి.. మనకు గ్యాస్‌ను తెప్పించే ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
బీన్స్‌లో ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే వాటిలో ఉండే ఫైబర్ అంత త్వరగా జీర్ణం కాదు. అందువల్ల జీర్ణాశయంలో గ్యాస్ మొదలవుతుంది. అదే బయటకు వెళ్లలేక మనకు కడుపు ఉబ్బరాన్ని తెచ్చి పెడుతుంది. ఈ ఫుడ్‌ను తింటే గనక గ్యాస్ వస్తుంటే ఎవరైనా ఈ ఫుడ్‌ను తినడం మానేయాల్సిందే. గోధుమల్లో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని కలగజేస్తుంది. కొన్ని సార్లు డయేరియా కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఆహారం తిన్నాక ఈ లక్షణాలు కనిపించే వారు గోధుమలతో తయారు చేసిన ఏ వంటకాన్ని తీసుకోకపోవడమే ఉత్తమం.
కొంతమందికి క్యాబేజీ, కాలిఫ్లవర్ తదితర కూరగాయలను తిన్నా గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. కనుక ఈ ఫుడ్ తినేవారు గ్యాస్ సమస్యలను ఎదుర్కొంటుంటే ఈ ఫుడ్‌ను తినడం మానేయాల్సి ఉంటుంది. పాలు, పాల సంబంధ పదార్థాలను కొందరు బాగా తీసుకుంటారు. అయితే అవి పడకపోతే గ్యాస్ సమస్యలు వస్తాయి. ఈ పదార్థాల వల్లే గ్యాస్ సమస్యలు వస్తున్నాయనుకుంటే వీటిని తినడం కూడా మానేయాల్సి ఉంటుంది. ప్రాసెస్ చేయబడిన ఆహార పదార్థాలు, ప్యాక్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, శీతల పానీయాలను తాగినా గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. కనుక ఈ ఫుడ్స్‌ను వీలైనంత తక్కువగా తీసుకుంటే బెటర్.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…