Alum : రోజూ మనం కచ్చితంగా స్నానం చేయాల్సిందే. స్నానం చేయడం వల్ల అలసిన శరీరానికి ఆహ్లాదం లభిస్తుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. అందుకని రోజూ ప్రతి ఒక్కరు రెండు పూటలా స్నానం చేయాల్సి ఉంటుంది. రాత్రి పూట స్నానం చేస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గడంతోపాటు చక్కగా నిద్ర కూడా పోవచ్చు. అయితే మీరు రోజూ ఉదయం పూట స్నానం చేసే నీటిలో మాత్రం ఇప్పుడు చెప్పబోయే ఒక పదార్థాన్ని కలిపి స్నానం చేయండి. దీంతో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇక ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా ఆలం (పటిక)ను కలిపి స్నానం చేయండి. దీంతో మీకు ఉండే అన్ని రకాల చర్మ వ్యాధులు పోతాయి. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. మృదువుగా తయారవుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. ఇక పటికను నీళ్లలో కలిపి ఆ నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని ఎలాంటి నొప్పులు అయినా సరే తగ్గిపోతాయి.
ముఖ్యంగా కండరాలు, కీళ్లు, మోకాళ్ల నొప్పులతోపాటు ఒళ్లు నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కొందరికి స్నానం చేసినా కూడా శరీరం దుర్వాసన వస్తుంటుంది. అలాంటి వారు స్నానం చేసే నీటిలో పటికను కలిపి స్నానం చేయడం వల్ల ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. కాలిన గాయాలు లేదా ఇతర గాయాలు, పుండ్లు ఉన్నవారు ఆలం కలిపిన నీళ్లతో కడుగుతుండడం వల్ల అవి త్వరగా మానుతాయి. ఇక షాంపూ కలిపిన నీళ్లలో ఆలం కలిపి దాంతో తలస్నానం చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా పటిక వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. కనుక దాన్ని ఉపయోగించడం మరిచిపోకండి.
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…
UCO Bank Recruitment 2026 | యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యూసీఓ బ్యాంక్) 2026 సంవత్సరానికి భారీ నియామక ప్రకటనను…
QR Code On Aadhar | కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను పొందడంతో పాటు దేశంలోని పౌరులకి ఆధార్ కార్డు అత్యంత…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…