lifestyle

Cranberries : ఈ పండ్లు ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కుండా తెచ్చుకుని తినండి..!

Cranberries : మ‌న‌కు అందుబాటులో అనేక ర‌కాల పండ్లు ఉంటాయి. వాటిల్లో క్రాన్ బెర్రీలు కూడా ఒక‌టి. పండ్ల షాపుల్లో ఇవి ఉంటాయి. కానీ వీటిని చాలా మంది అంత‌గా ప‌ట్టించుకోరు. కానీ వాస్త‌వానికి ఈ పండ్లు మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇవి చూసేందుకు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఎరుపు రంగులో గుండ్ర‌గా ఉంటాయి. రుచి చూస్తే కాస్త పులుపుగా, తియ్య‌గా ఉంటాయి. అయితే ఈ పండ్ల‌ను ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్టకుండా తెచ్చుకుని తినండి. ఎందుకంటే ఈ పండ్లతో అనేక లాభాలు క‌లుగుతాయి. ఈ పండ్లు అందించే ప్ర‌యోజ‌నాల గురించి తెలిస్తే మీరు వీటిని విడిచిపెట్ట‌కుండా తింటారు. ఇక క్రాన్ బెర్రీల‌తో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రాన్ బెర్రీల‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు, విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీని వ‌ల్ల సీజ‌న‌ల్ వ్యాధుల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు. సీజన్లు మారినప్పుడు ఈ పండ్ల‌ను తింటే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటివి రాకుండా చూసుకోవ‌చ్చు. జ్వ‌రం వ‌చ్చిన వారు క్రాన్ బెర్రీ పండ్ల‌కు చెందిన జ్యూస్‌ను తాగితే త్వ‌ర‌గా కోలుకుంటారు. క్రాన్ బెర్రీల‌ను తిన‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. చ‌ర్మాన్ని ఇవి సంర‌క్షిస్తాయి.

Cranberries

ఈ పండ్ల‌ను తింటే దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. నోట్లో ఉండే బాక్టీరియా న‌శిస్తుంది. దీంతో నోటి దుర్వాస‌న నుంచి విముక్తి ల‌భిస్తుంది. క్రాన్‌బెర్రీల‌ను తిన‌డం వ‌ల్ల మూత్రాశయ ఇన్‌ఫెక్ష‌న్‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతో మూత్రం సాఫీగా జారీ అవుతుంది. ఇక వీటిని తింటే విరేచ‌నాలు త‌గ్గిపోతాయి. జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం లభిస్తుంది. కనుక క్రాన్ బెర్రీల‌ను ఇక‌పై మీరు ఎప్పుడైనా బ‌య‌ట మార్కెట్‌లో చూస్తే అస‌లు విడిచిపెట్ట‌కండి. వీటితో ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM