Left Over Rice Vada : మనం అల్పాహారంలో భాగంగా అప్పుడప్పుడు వడలను తయారు చేస్తూ ఉంటాము. వడలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే తరచూ ఒకేరకంగా కాకుండా మనం అన్నంతో కూడా వడలను తయారు చేసుకోవచ్చు. అన్నంతో చేసే ఈ వడలు చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే వీటిని ఇన్ స్టాంట్ గా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు, ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. ఈవడలను తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ రైస్ వడలను ఇన్ స్టాంట్ గా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అన్నం – ఒక కప్పు, బొంబాయి రవ్వ – ఒక కప్పు, పెరుగు – అర కప్పు, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, క్యారెట్ తురుము – పావు కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, వంటసోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రై సరిపడా.
ముందుగా జార్ లో అన్నం, రవ్వ, పెరుగు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో వంటసోడా, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నానబెట్టాలి. పిండి నానిన తరువాత ఇందులో వంటసోడా వేసి కలపాలి. పిండి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసి వడ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చేతులకు నీటితో తడి చేసుకుంటూ పిండిని తీసుకుని వడలాగా వత్తుకుని నూనెలో వేసుకోవాలి. ఈ వడలను మధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రైస్ వడలు తయారవుతాయి. వీటిని చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో మనం అన్నంతో రుచిగా వడలను తయారు చేసుకుని తినవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…