Intelligent : మీరు తెలివైన వారే అని అనుకుంటున్నారా ? ఏంటీ వింత ప్రశ్న అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే.. తెలివి ఉన్న వారు ఎవరూ తమకు బాగా తెలివి ఉందని గొప్పలు చెప్పుకోరు. తెలివి లేని వారే ఆ పనిచేస్తుంటారు. అయితే తెలివి తేటల విషయానికి వస్తే.. ఎవరికైనా కింద తెలిపిన అంశాలు సరిపోతే.. వారు తెలివిగల వారికిందే లెక్కనట. ఈ విషయాన్ని మేం చెప్పడం లేదు. సైంటిస్టుల అధ్యయనాలే చెబుతున్నాయి. మరి ఏయే అంశాలు ఉంటే తెలివికలవారో ఇప్పుడు తెలుసుకుందామా..!
మీరు ఏదైనా సంగీత వాయిద్యాన్ని బాగా వాయిస్తారా ? 4 నుంచి 6 సంవత్సరాల వయస్సులోనే వాయిద్యాలను వాయించడం బాగా నేర్చుకున్నారా ? అయితే మీరు బాగా తెలివికలవారి కింద లెక్కేనని సైంటిస్టులు చెబుతున్నారు. సాధారణంగా కుటుంబంలో వయస్సులో అందరికన్నా పెద్దవారు బాగా తెలివిగల వారు అయి ఉంటారని సైంటిస్టుల పరిశోధనలు చెబుతున్నాయి. మీరు బాగా సన్నగా ఉన్నా తెలివికలవారి కిందకే వస్తారు. ఎందుకంటే 2006లో సైంటిస్టులు నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది.డబ్బా పాల కన్నా తల్లిపాలు తాగి పెరిగిన వారికే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయట.
పుస్తక పఠనం అంటే ఆసక్తి ఉన్నవారు కూడా తెలివిమంతులు అయి ఉంటారని సైంటిస్టులు చెబుతున్నారు. ఎడమ చేతి వాటం ఉన్నవారు కూడా బాగా తెలివికల వారు అయి ఉంటారట. బాగా ఆందోళన పడేవారు, హాస్య చతురుల కలిగి ఉండేవారు, ఏదైనా నిర్దిష్టమైన విషయం పట్ల ఆసక్తి కలిగి ఉండేవారు, అన్ని విషయాల్లోనూ పర్ఫెక్షన్ కోరుకునేవారు తెలివిమంతులని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక చివరిగా.. ఎవరికీ అర్థం కాకుండా రాసేవారు కూడా తెలివికల వారు అయి ఉంటారని సైంటిస్టుల పరిశోధనల్లో తెలిసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…