Lakshmi Devi : లక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి అనేది చాలామందికి సందేహం. లక్ష్మీ అనుగ్రహం ఉంటే సకల సంపదలు, సకల కార్యాలు దిగ్విజయం అవుతాయి. అయితే ఆ తల్లి అనుగ్రహానికి ఏం చేయాలో పండితులు చెప్పిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం ప్రాతఃకాలంలో శ్రీమహాలక్ష్మీకి పూజ చేయాలి. పూజలో తులసీ పత్రాన్ని, తులసి మంజరిని సమర్పించండి. సాధనా, పూజా, ప్రార్థనా సమయంలో మీ ముఖం తూర్పువైపు, లేదా పశ్చిమం వైపునకు అయినా ఉండాలి.
ప్రతి శనివారం ఇంటిని శుభ్రపరచుకోవాలి. సాలెగూళ్ళు, మట్టి, చెత్త, విరిగిపోయిన వస్తువుల్ని సర్ది శుభ్రం చేయాలి. మీ ఇంటి సింహద్వారం దగ్గర లోపలి వైపు శ్రీగణేశుడిని ఉంచండి. ఆయన ముఖం మీ ఇంటిని చూస్తున్నట్టు ఉండాలి. దిశను గురించి పట్టించుకోనవసరం లేదు. ఆయనకు ప్రాతఃకాలమే గరికను సమర్పించుకోవాలి.
అదేవిధంగా శ్రీలక్ష్మీసూక్తం అంటే శ్రీసూక్తం అది రాని వారు కనీసం లక్ష్మీ అష్టోతరం ప్రతినిత్యం చదువుకోవడం చాలా మంచి ఫలితాన్నిస్తుంది. అదేవిధంగా లక్ష్మీదేవి కూర్చున్న ఫోటోను ఇంట్లో పెట్టుకొని నిత్యం అక్కడ పుష్పాలను వీలైతే కమలాలు లేదా గులాబీలను లేదా మందారం పెట్టడం, ధూపం వేయడం చేయాలి. ఏ మంత్రం శ్లోకం రాకున్నా నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే అనే శ్లోకాలను చదువుకోవాలి. అదిరాకుంటే ఓం శ్రీ మహాలక్ష్మీయైనమః అనేనామాన్ని భక్తి, శ్రద్ధతో కనీసం 108 సార్లు జపం చేయండి. తప్పక అనతి కాలం అంటే శ్రీఘ్రంగా మీయందు లక్ష్మీదేవికి కరుణ కలిగి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. సకల శుభాలను కలిగిస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…