Beard : గడ్డం ఉంటే అడ్డం అనుకుని చాలా మంది గడ్డాన్ని క్లీన్ షేవ్ చేస్తుంటారు. ఇక కొందరు చాలా తక్కువ సైజులో వెంట్రుకలు కనిపించేలా గడ్డాన్ని స్టైల్ చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది వింటే.. ఇకపై ఎవరూ గడ్డాన్ని తీసేయడానికి ఇష్టపడరు సరికదా.. ఇంకా ఎక్కువగా గడ్డం పెంచుకుంటారు. ఎందుకంటే.. గడ్డం వల్ల చర్మం సంరక్షింపబడుతుందట. అలాగే సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి గడ్డం రక్షిస్తుందట. అవును.. షాకింగ్‌గా ఉన్న ఇది నిజమే. పలువురు సైంటిస్టుల పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.
యూనివర్సిటీ ఆఫ్ సదరన్ క్వీన్స్‌ల్యాండ్, బ్రిటిష్ స్కిన్ ఫౌండేషన్ సంస్థలు వేర్వేరుగా చేసిన పరిశోధనల్లో తేలిందేమిటంటే.. పురుషులు పెంచుకునే గడ్డం వల్ల సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత (అల్ట్రా వయొలెట్) కిరణాల బారి నుంచి 95 శాతం వరకు రక్షణ లభిస్తుందట.
అలాగే చర్మ క్యాన్సర్లు రాకుండా ఉంటాయట. దీంతోపాటు చర్మానికి సంరక్షణ లభిస్తుందట. అందువల్ల ఇకపై పురుషులు ఎవరైనా సరే.. గడ్డం అడ్డంగా ఉందని పూర్తిగా క్లీన్ షేవ్ చేసేముందు ఒక్కసారి ఆలోచించండి. గడ్డం ఉండడం వల్ల ఈ లాభాలు కలుగుతాయి. అయితే కొందరికి గడ్డం పరంగా చర్మం దురదలు వస్తుంది. అలాంటి వారు ఈ విషయాన్ని పట్టించుకోవాల్సిన పనిలేదు. మిగిలిన ఎవరైనా సరే గడ్డం పెంచుకోవడంపై దృష్టి సారించండి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…