lifestyle

Mutton Biryani Recipe In Telugu : మ‌ట‌న్ బిర్యానీని ఇలా చేశారంటే.. హోట‌ల్స్‌లో తిన్న‌ట్లు వ‌స్తుంది.. రుచిగా ఉంటుంది..!

Mutton Biryani Recipe In Telugu : మ‌న‌కు తినేందుకు ఎన్నో ర‌కాల బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్నింటిలోకెల్లా మ‌ట‌న్ బిర్యానీ భ‌లే టేస్ట్‌గా ఉంటుంది. అవ‌స‌ర‌మైన ప‌దార్థాలు వేసి, చ‌క్క‌గా మ‌ట‌న్‌ను ఉడికించి, మ‌సాలాలు వేసి బిర్యానీని వండితే.. ఆ త‌రువాత ఆ బిర్యానీ నుంచి వ‌చ్చే ఘుమాళింపు మామూలుగా ఉండ‌దు. వాస‌న చూస్తేనే నోరూరిపోతుంది. మ‌రి అలాంటి ఘుమ ఘుమ‌లాడే మ‌ట‌న్ బిర్యానీని ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

మ‌ట‌న్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు..

మ‌ట‌న్ – 1/2 కిలో, ఉప్పు – త‌గినంత, అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు, ప‌చ్చిమిర్చి పేస్ట్ – 1 టీస్పూన్, ప‌సుపు – 1/4 టీస్పూన్, కారం – 2 టీస్పూన్లు, ఉల్లిపాయ‌లు – 2, గ‌రం మ‌సాలా – 1 టీస్పూన్, నూనె – 1/2 క‌ప్పు, నిమ్మ‌ర‌సం – 2 టీస్పూన్లు, బాస్మ‌తీ రైస్ – 1/2 కిలో, వెన్న – 2 టీస్పూన్లు, కొత్తిమీర, పుదీనా – 2 క‌ట్ట‌ల చొప్పున, పెరుగు – 1/4 క‌ప్పు, యాల‌కులు – 4, ల‌వంగాలు – 3, దాల్చిన చెక్క – 1 (పెద్దది), బిర్యానీ ఆకులు – 2, బిర్యానీ మ‌సాలా – ఒక‌టిన్నర‌ టీస్పూన్.

Mutton Biryani Recipe In Telugu

మ‌ట‌న్ బిర్యానీ తయారు చేసే విధానం..

ముందుగా బాస్మ‌తి బియ్యాన్ని 20 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. ఆ తరువాత యాల‌కులు, ల‌వంగాలు, దాల్చిచెక్క‌, బిర్యానీ ఆకులు, కొద్దిగా వెన్న వేసి ముప్పావు వంతు వ‌ర‌కు బియ్యాన్ని ఉడికించాలి. అనంత‌రం మ‌ట‌న్ ముక్క‌ల‌ను బాగా క‌డిగి వాటికి అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ప‌చ్చి మిర్చి పేస్ట్‌, ప‌సుపు, కారం, గ‌రం మ‌సాలా, నిమ్మ‌ర‌సం, కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసి బాగా క‌లిపి ప‌క్క‌న పెట్టాలి. 20 నిమిషాల పాటు మ‌ట‌న్ ముక్క‌ల‌ను మారినేట్ చేసుకోవాలి.

అనంత‌రం ఒక పాత్ర తీసుకుని అందులో నూనె వేసి వేడెక్కాక మ‌ట‌న్ ముక్క‌లు వేసి కూర‌లా ఉడికించాలి. అనంత‌రం ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేయించుకోవాలి. త‌రువాత ఒక పాత్ర తీసుకుని అందులో ముందుగా కొంత అన్నం వేయాలి. దానిపై కాస్త మ‌ట‌న్‌, కొన్ని ఉల్లిపాయ ముక్క‌ల‌ను పేర్చాలి. అలాగే అన్నీ అయిపోయే వ‌రకు ఒక‌దాని మీద మ‌రొక‌టి పేరుస్తూ రావాలి. అనంతరం పాత్ర‌పై మూత పెట్టి 20 నిమిషాల పాటు స‌న్న‌ని మంట‌పై ఉడికించాలి. దీంతో ఘుమ ఘుమ‌లాడే మ‌ట‌న్ బిర్యానీ త‌యార‌వుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM

విడాకుల తర్వాత గోల్డెన్ టెంపుల్‌లో హన్సిక.. వైరల్ అవుతున్న ‘కీలక’ పోస్ట్!

వ్యాపార వేత్త సోహైల్ ఖ‌తురియాతో విడాకులు తీసుకున్న అనంత‌రం హ‌న్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సంద‌ర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీల‌క పోస్టు…

Wednesday, 18 March 2026, 12:31 PM

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM