Ginger Milk : అల్లంలో ఎలాంటి ఔషధ గుణాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. మనకు వచ్చే స్వల్ప అనారోగ్య సమస్యలైన దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం తదితర సమస్యల నుంచి అల్లం మనల్ని బయట పడేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములను చంపేస్తాయి. అలాంటి అల్లాన్ని రసం తీసి దాన్ని నిత్యం పాలలో కలుపుకుని తాగితే మనకు ఇంకా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
జింజర్ మిల్క్ (అల్లం రసం కలిపిన పాలు) తాగడం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. వర్షాకాలంలో మనకు ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. జింజర్ మిల్క్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్‌ను నశింపజేస్తాయి. దీంతో క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి. క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. సూక్ష్మ క్రిములు శరీరంలోకి చేరగానే నశిస్తాయి. జీర్ణశక్తి లేని వారు లేదా ఆ శక్తి బాగా తగ్గిన వారు నిత్యం జింజర్ మిల్క్‌ను తాగితే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. ఎలాంటి ఆహారాన్నయినా సరే అవలీలగా జీర్ణం చేసుకోగలుగుతారు. అలాగే మలబద్దకం, కడుపు నొప్పి, అసిడిటీ తగ్గుతాయి.
జింజర్ మిల్క్‌లో ఉండే కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం ఎముకలు, దంతాలను దృఢంగా చేస్తాయి. ఆస్టియో పోరోసిస్ సమస్య ఉన్నవారు ఈ మిల్క్‌ను తాగితే మంచిది. దీంతో ఎముకల వద్ద శరీర భాగం వాపులకు గురి కాకుండా ఉంటుంది. నొప్పులు తగ్గుతాయి. గొంతు నొప్పి, మంట, గొంతు బొంగురు పోవడం సమస్యలు ఉన్నవారు జింజర్ మిల్క్ తాగాలి. ఈ మిల్క్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఆయా సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు జింజర్ మిల్క్ తాగితే వారి షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…