Osteoporosis : వయస్సు మీద పడిన కొద్దీ మనకు వచ్చే అనారోగ్య సమస్యల్లో ఆస్టియోపోరోసిస్ కూడా ఒకటి. ఎముకలు రాను రాను గుల్లగా మారి పోయి బలహీనమైపోతాయి. దీంతో చిన్న దెబ్బ తగిలినా అవి విరుగుతాయి. దీన్నే ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇది చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఆరంభంలో ఈ వ్యాధి ఉంటే గుర్తించడం కష్టమే. ఎముకలు విరిగినప్పుడు, ఫ్రాక్చర్ అయినప్పుడు పరీక్షలు చేస్తే తెలుస్తుంది. అయితే మనం నిత్య జీవితంలో తీసుకునే పలు ఆహార పదార్థాలు కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చేందుకు కారణాలు అవుతుంటాయి. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటంటే..
కోలా వంటి శీతలపానీయాలు ఎక్కువగా తాగేవారికి ఆస్టియోపోరోసిస్ వస్తుంది. వాటిల్లో ఉండే పాస్ఫారిక్ యాసిడ్ ఎముకలను గుల్లగా మారుస్తుంది. దీంతో ఎముకలు బలహీనంగా మారి క్రమంగా ఆస్టియోపోరోసిస్ వస్తుంది. చక్కెర, రీఫైన్డ్ కార్బొహైడ్రేట్లను ఎక్కువగా తినేవారికి కూడా ఆస్టియోపోరోసిస్ వస్తుంది. చిప్స్, బ్రెడ్, వైట్ రైస్, కార్న్ లలో రీఫైన్ చేయబడిన పదార్థాలను తింటే ఎముకలు బలహీనమవుతాయి. తద్వారా వయస్సు మీద పడ్డాక ఆస్టియోపోరోసిస్ వస్తుంది.
గ్రిల్ చేయబడి, కాల్చబడిన పదార్థాలను కూడా తినరాదు. వాటి వల్ల కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉప్పు ఎక్కువగా తిన్నా ఆస్టియోపోరోసిస్ త్వరగా వస్తుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. క్రిమి సంహారకాలు బాగా ఉపయోగించి పండించిన పండ్లు, కూరగాయలను తింటున్నా లేదా.. విపరీతంగా మద్యం సేవిస్తున్నా.. ఆస్టియోపోరోసిస్ త్వరగా వస్తుంది. కనుక ఈ ఆహారాలను తీసుకుంటున్న వారు జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడతారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం జూనియర్ ఎన్‌టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…