Chewing Gum : చూయింగ్ గ‌మ్‌ల‌ను రోజూ తింటున్నారా.. అయితే ఇది చ‌దివితే ఇక‌పైఆ ప‌నిచేయ‌రు..!

March 15, 2024 3:52 PM

Chewing Gum : ముఖానికి వ్యాయామం అవుతుంద‌ని కొంద‌రు.. స‌ర‌దాగా కొంద‌రు.. అల‌వాటు ప్ర‌కారం ఇంకొంద‌రు.. త‌రచూ చూయింగ్ గ‌మ్‌ల‌ను న‌ములుతుంటారు. అయితే చూయింగ్ గమ్‌లు నిజానికి మ‌న‌కు తీవ్ర‌మైన దుష్ప‌రిణామాల‌ను క‌లిగించ‌వ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు భావిస్తూ వ‌చ్చారు. కానీ అది నిజం కాద‌ని.. చూయింగ్ గ‌మ్‌ల వ‌ల్ల మ‌న పేగుల్లో స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డిస్తున్నాయి.

యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌కు చెందిన కొంద‌రు ప‌రిశోధ‌కులు చూయింగ్ గ‌మ్‌ల‌ను న‌మిలే కొంద‌రిపై ప‌రిశోధ‌న‌లు చేశారు. చూయింగ్ గ‌మ్‌ల‌లో ఉండే టైటానియం డ‌యాక్సైడ్ అన‌బ‌డే ఓ ర‌సాయ‌నిక స‌మ్మేళ‌నం మ‌న పేగులకు స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడుతుంద‌ని ఆ సైంటిస్టులు తేల్చారు. స‌ద‌రు ర‌సాయ‌నం వ‌ల్ల పేగులు మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాలను స‌రిగ్గా గ్ర‌హించ‌లేవ‌ని నిర్దారించారు.

if you are taking Chewing Gum regularly then do not do that
Chewing Gum

చూయింగ్ గ‌మ్‌ల‌ను ఎక్కువ‌గా న‌మిలే వారిలో పోష‌కాహార స‌మ‌స్య‌లు వ‌స్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ గ‌మ్‌ల‌లో ఉండే టైటానియం డ‌యాక్సైడ్ వల్ల పేగులు మ‌నం తినే ఆహారంలో ఉండే ఐర‌న్‌, జింక్‌, ఫ్యాటీ యాసిడ్లు త‌దిత‌ర పోష‌కాల‌ను గ్ర‌హించ‌లేవ‌ని చెబుతున్నారు. క‌నుక చూయింగ్ గ‌మ్‌ల‌ను తినేవారు వాటికి దూరంగా ఉంటే మంచిద‌ని సైంటిస్టులు స‌ల‌హా ఇస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now