lifestyle

Hibiscus Gardening : మందార మొక్క‌ల‌కు ఇలా చేస్తే పువ్వులు గుత్తులుగా వ‌స్తాయి..!

Hibiscus Gardening : మ‌నం ఇంట్లో పెంచుకోద‌గిన అంద‌మైన మొక్క‌ల‌ల్లో మందార మొక్క కూడా ఒక‌టి. మందార మొక్క మ‌న‌కు అనేక రంగుల‌ల్లో ల‌భిస్తుంది. చాలా మంది దీనిని ఇండ్ల‌ల్లో పెంచుకుంటారు. అలాగే పార్కుల‌ల్లో కూడా ఈ మొక్క‌ల‌ను ఎక్కువ‌గా పెంచుతారు. దేవుడికి కూడా మందార పూల‌న స‌మ‌ర్పిస్తూ ఉంటారు. ఇంటి పెర‌ట్లో మందార మొక్క ఉంటే ఆ ఇంటికే ఎంతో అందం వ‌స్తుంది. ఇంట్లో ఒక్క మందార మొక్క ఉంటే చాలు మ‌న‌కు సంవ‌త్స‌ర‌మంతా పూలు వ‌స్తూనే ఉంటాయి. అలాగే మందార పువ్వుల‌ను, ఆకుల‌ను జుట్టు సంర‌క్ష‌ణ‌లో కూడా ఉప‌యోగిస్తూ ఉంటారు. మందార ఆకుల‌ను, పువ్వుల‌ను నూనెలో వేసి మ‌రిగించి ఆ నూనె ను జుట్టుకు రాసుకోవ‌డం అలాగే మందార ఆకుల‌ను, పూల‌ను పేస్ట్ గా చేసి జుట్టుకు ప‌ట్టించ‌డం వంటివి చేస్తూ ఉంటారు. మందార మొక్క‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల జుట్టు స‌మ‌స్య‌లు తీరుతాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌ల ద్వారా కూడా వెల్ల‌డించారు.

ఇలా మందార మొక్క ఇంటితో పాటు మ‌న జుట్టుకు కూడా ఎంతో అందాన్ని తీసుకువ‌స్తుంది. అలాగే మందార కూడా చాలా సుల‌భంగా పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఈ మొక్క‌కు కూడా చీడ ప‌డుతూ ఉంటుంది. అనేక ర‌కాల క్రిమి కీట‌కాలు దాడి చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా తెల్ల న‌ల్లి, పేనుబంక వంటి చీడ‌లు ప‌డుతూ ఉంటాయి. దీంతో ఆకులు ముడుచుకోవ‌డం, పూలు స‌రిగ్గా రాక‌పోవ‌డం, ఆకులు ప‌సుప రంగులోకి మార‌డం వంటివి జ‌రుగుతాయి. మందార చెట్టుకు పట్టిన ఈ చీడ‌ల‌ను పోగొట్ట‌డానికి అంద‌రూ క్రిమి సంహారాల‌ను వాడ‌లేరు. అలాగే స‌హ‌జ సిద్దంగా మొక్క‌ల‌ను పెంచాల‌నుకునే వారు కూడా ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే చిట్కాను పాటించ‌డం వ‌ల్ల మందార మొక్క‌కు పట్టిన చీడ‌ల‌న్నింటిని తొల‌గించ‌వ‌చ్చు. ఎటువంటి క్రిమి సంహారాలు వాడ‌కుండానే మొక్క‌ను తిరిగి ఆరోగ్య‌వంతంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ చీడ‌ల‌ను తొల‌గించ‌డానికి గానూ మ‌నం ఒక స్ప్రేను త‌యారు చేసుకోవాల్సి ఉంటుంది.

Hibiscus Gardening

దీని కోసం ఒక గ్లాస్ మ‌జ్జిగ‌ను ఒక గిన్నెలో పోసి వారం రోజుల పాటు పులియ‌బెట్టాలి. రోజులో రెండుసార్లు గిన్నెపై ఉండే మూత‌ను తీస్తూ ఉండాలి. మ‌జ్జిగ పులిసిన త‌రువాత ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు తీసుకుని అందులో అర టీ స్పూన్ ప‌సుపు వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఇందులో పులియ‌బెట్టిన మ‌జ్జిగ‌ను కూడా పోసి క‌ల‌పాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని స్ప్రే బాటిల్ పోసుకుని మందార చెట్టు అంతా త‌డిసేలా బాగా స్ప్రే చేయాలి. ప్ర‌తి ఆకు రెండు వైపులా, అలాగే కాండం మొద‌లు నుండి చివ‌రి వ‌ర‌కు అంతా త‌డిసేలా బాగా స్ప్రే చేసుకోవాలి. అలాగే కొద్ది మొత్తంలో ఈ ద్రావ‌ణాన్ని చెట్టు మొద‌లులో కూడా పోయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మందార మొక్క‌కు పట్టిన చీడ‌ల‌న్ని న‌శిస్తాయి. అలాగే మొక్క కూడా ఏపుగా పెరుగుతుంది. పూలు కూడా మ‌రింత అందంగా, బ‌లంగా పూస్తాయి. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌న‌క కానీ, మొక్క‌కు కానీ ఎటువంటి హాని క‌ల‌గ‌దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM