Akshaya Tritiya 2024 : అక్షయ తృతీయ.. దీనిని అఖా తీజ్ అని కూడా పిలుస్తారు. హిందువులు, జైనులు ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. ఈ పండుగ వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 10 న శుక్రుడు అస్తమించడంతో అక్షయ తృతీయ జరుగుతుంది. జోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని ప్రేమ, అందం, శ్రేయస్సుకు కారకంగా పరిగణిస్తారు. వివాహం వంటి శుభ కార్యాలకు దీని అమరిక అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. శుక్రుడు అస్తమించడం వల్ల ఈ సంవత్సరం అక్షయ తృతీయ నాడు వివాహానికి సరైన ముహుర్తం లేదు. అలాగే ఈ రోజున అనేక శుభ యోగాలు కూడా ఏర్పడతాయి. గజకేసరి యోగం, ధన యోగం, శుక్రాధిత్య యోగం, షష్ యోగం, మాళవ్య రాజ యోగం వంటి యోగాలు కూడా ఈ అక్షయతృతీయ నాడు ఏర్పడనున్నాయి.
ఈ యోగాల వల్ల అన్ని రాశుల వారికి మేలు కలిగినప్పటికి కొన్ని రాశుల వారికి మరింత మేలు కలుగనుంది. అక్షయ తృతీయ నాడు ఏర్పడే ఈ యోగాల వల్ల మేలు కలగనున్న రాశుల గురించి … ఇప్పుడు తెలుసకుందాం. గజకేసరి యోగం వల్ల వృషభ, సింహ, కన్యా రాశుల వారికి ధనవృద్ది, శ్రేయస్సు, విజయం కలగనుంది. సూర్యుడు, బృహస్పతి కలయికతో ఏర్పడిన ఈ గజకేసరి యోగం సంపద, శ్రేయస్సును, కొత్త అవకాశాలన పొందడాన్ని సూచిస్తుంది. ఈ రాశి చక్రం ఉన్న వారు వ్యాపారం, వృత్తి, పెట్టుబడిలో అపూర్వమైన విజయాన్ని పొందుతారు. ధన యోగం వల్ల మీనరాశి వారికి ఆర్థిక లాభాలు, వ్యాపారంలో వృద్ది కలగనుండి. బుధుడు, కుజుడు కలయికతో ఏర్పడిన ఈ యోగం ఆకస్మిక ధన లాభానికి , కొత్త ఆస్తులకు, ఆర్థిక ప్రగతికి ప్రతీక.
మీన రాశి వారు వారసత్వం భూమి లేదా ఆస్థికి సంబంధించిన ప్రయోజనాలను పొందవచ్చు. ఇక శుక్రాధిత్య యోగం వల్ల అన్ని రాశుల వారికి మేలు కలిగినప్పటికి ముఖ్యంగా వృషభ, తుల, మకర రాశి వారికి మరింత మేలు కలుగనుంది. శుక్రుడు, సూర్యుని కలయికతో ఏర్పడిన ఈ యోగం ప్రేమ, అందం, విజయానికి చిహ్నం. ఈ రాశి వారు జీవితంలో ప్రేమను పొందుతారు. సమాజంలో గౌరవాన్ని పెంచుకుంటారు. అలాగే షష్ యోగం వల్ల కర్కాటకం, వృశ్యికం, మీనరాశుల వారికి గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే మాళవ్య రాజయోగం వల్ల మీన రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. నూతన ఆస్తులు సంపాదిస్తారు. బృహస్పతి, చంద్రుని కలయికతో ఏర్పడిన ఈ యోగం కీర్తి, గౌరవం పెరగడాన్ని సూచిస్తుంది. ఈ విధంగా ఈ అక్షయ తృతీయ ఈ రాశుల వారికి మరింత మేలు చేయనన్నదని పండితులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…