Akshaya Tritiya 2024 : ఈ ఏడాది అక్ష‌య తృతీయ త‌రువాత నుంచి ఈ 3 రాశుల వాళ్ల‌కు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది..!

May 2, 2024 3:49 PM

Akshaya Tritiya 2024 : అక్ష‌య తృతీయ‌.. దీనిని అఖా తీజ్ అని కూడా పిలుస్తారు. హిందువులు, జైనులు ఈ పండుగ‌ను ఎక్కువ‌గా జ‌రుపుకుంటారు. ఈ పండుగ వైశాఖ మాసంలోని శుక్ల‌ప‌క్షంలోని తృతీయ తిథి నాడు జ‌రుపుకుంటారు. ఈ సంవ‌త్స‌రం మే 10 న శుక్రుడు అస్త‌మించ‌డంతో అక్ష‌య తృతీయ జ‌రుగుతుంది. జోతిష్య శాస్త్రంలో శుక్ర గ్ర‌హాన్ని ప్రేమ, అందం, శ్రేయ‌స్సుకు కార‌కంగా ప‌రిగ‌ణిస్తారు. వివాహం వంటి శుభ కార్యాల‌కు దీని అమ‌రిక అశుభ‌క‌ర‌మైన‌దిగా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది. శుక్రుడు అస్త‌మించ‌డం వ‌ల్ల ఈ సంవ‌త్స‌రం అక్ష‌య తృతీయ నాడు వివాహానికి స‌రైన ముహుర్తం లేదు. అలాగే ఈ రోజున అనేక శుభ యోగాలు కూడా ఏర్ప‌డ‌తాయి. గ‌జ‌కేస‌రి యోగం, ధ‌న యోగం, శుక్రాధిత్య యోగం, ష‌ష్ యోగం, మాళ‌వ్య రాజ యోగం వంటి యోగాలు కూడా ఈ అక్ష‌య‌తృతీయ నాడు ఏర్ప‌డ‌నున్నాయి.

ఈ యోగాల వ‌ల్ల అన్ని రాశుల వారికి మేలు క‌లిగిన‌ప్ప‌టికి కొన్ని రాశుల వారికి మ‌రింత మేలు క‌లుగ‌నుంది. అక్ష‌య తృతీయ నాడు ఏర్ప‌డే ఈ యోగాల వ‌ల్ల మేలు క‌ల‌గ‌నున్న రాశుల గురించి … ఇప్పుడు తెలుస‌కుందాం. గ‌జ‌కేస‌రి యోగం వ‌ల్ల వృష‌భ‌, సింహ‌, క‌న్యా రాశుల వారికి ధ‌న‌వృద్ది, శ్రేయ‌స్సు, విజ‌యం క‌లగ‌నుంది. సూర్యుడు, బృహ‌స్ప‌తి క‌ల‌యిక‌తో ఏర్ప‌డిన ఈ గ‌జ‌కేస‌రి యోగం సంప‌ద‌, శ్రేయ‌స్సును, కొత్త అవ‌కాశాల‌న పొంద‌డాన్ని సూచిస్తుంది. ఈ రాశి చ‌క్రం ఉన్న వారు వ్యాపారం, వృత్తి, పెట్టుబ‌డిలో అపూర్వ‌మైన విజయాన్ని పొందుతారు. ధ‌న యోగం వ‌ల్ల మీన‌రాశి వారికి ఆర్థిక లాభాలు, వ్యాపారంలో వృద్ది క‌ల‌గ‌నుండి. బుధుడు, కుజుడు క‌ల‌యిక‌తో ఏర్ప‌డిన ఈ యోగం ఆక‌స్మిక ధ‌న లాభానికి , కొత్త ఆస్తుల‌కు, ఆర్థిక ప్ర‌గ‌తికి ప్ర‌తీక‌.

Akshaya Tritiya 2024 know the date and time horoscope
Akshaya Tritiya 2024

మీన రాశి వారు వార‌స‌త్వం భూమి లేదా ఆస్థికి సంబంధించిన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక శుక్రాధిత్య యోగం వ‌ల్ల అన్ని రాశుల వారికి మేలు క‌లిగిన‌ప్ప‌టికి ముఖ్యంగా వృష‌భ‌, తుల‌, మ‌క‌ర రాశి వారికి మ‌రింత మేలు క‌లుగ‌నుంది. శుక్రుడు, సూర్యుని క‌ల‌యిక‌తో ఏర్ప‌డిన ఈ యోగం ప్రేమ‌, అందం, విజ‌యానికి చిహ్నం. ఈ రాశి వారు జీవితంలో ప్రేమ‌ను పొందుతారు. స‌మాజంలో గౌర‌వాన్ని పెంచుకుంటారు. అలాగే ష‌ష్ యోగం వ‌ల్ల క‌ర్కాట‌కం, వృశ్యికం, మీన‌రాశుల వారికి గౌర‌వ‌, ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. అలాగే మాళ‌వ్య రాజ‌యోగం వ‌ల్ల మీన రాశి వారికి ఆక‌స్మిక ధ‌న‌లాభం క‌లుగుతుంది. నూత‌న ఆస్తులు సంపాదిస్తారు. బృహ‌స్ప‌తి, చంద్రుని క‌ల‌యిక‌తో ఏర్ప‌డిన ఈ యోగం కీర్తి, గౌర‌వం పెర‌గ‌డాన్ని సూచిస్తుంది. ఈ విధంగా ఈ అక్ష‌య తృతీయ ఈ రాశుల వారికి మ‌రింత మేలు చేయ‌న‌న్న‌దని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now