Foods For Skin : చూడచక్కని, మృదువైన, మెరిసే చర్మం ఉండాలనే చాలా మంది కోరుకుంటారు. కానీ కొందరికి ఈ తరహా చర్మం పుట్టుకతోనే వస్తుంది. కానీ కొందరికి మాత్రం ఇలా ఉండదు. ఏదో ఒక చర్మ సమస్య ఉంటుంది. దీంతో వారు తమ చర్మాన్ని కాంతివంతంగా మార్చుకునేందుకు రక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అలాంటి వారు కింద సూచించిన ఆహారాలను నిత్యం తీసుకుంటే చాలు.. దాంతో చర్మ సమస్యలను పోగొట్టుకోవచ్చు. అలాగే చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. మరి అందుకు నిత్యం తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
మన శరీరంలో ఉండే లివర్ సరిగ్గా పనిచేసేందుకు మెగ్నిషియం ఎంతగానో ఉపయోగపడుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటేనే చర్మం కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది. కనుక లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఆహారం కూడా తినాలి. అందుకు గాను మెగ్నిషియం ఎక్కువగా ఉండే డార్క్ చాకొలెట్లు, ఫిగ్ పండ్లు, అరటి పండ్లు, విత్తనాలు, అవకాడో తదితరాలను నిత్యం తీసుకుంటే తద్వారా లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో చర్మం కూడా సురక్షితంగా, కాంతివంతంగా మారుతుంది.
ఫ్యాటీ యాసిడ్లు కూడా మన చర్మాన్ని సంరక్షిస్తాయి. కనుక ఇవి ఎక్కువగా ఉండే ఆలివ్ ఆయిల్, అవిసె విత్తనాలు, బాదంపప్పు, తృణ ధాన్యాలు ఎక్కువగా తింటే ఫ్యాటీ యాసిడ్లు లభించి తద్వారా చర్మ సమస్యలు పోతాయి. చర్మ సౌందర్యం పెరుగుతుంది. తాజా కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు, నట్స్ శరీరంలో ఆల్కలైన్ స్వభావాన్ని పెంచుతాయి. దీని వల్ల చర్మం సంరక్షింపబడుతుంది. కనుక వీటిని కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం జూనియర్ ఎన్‌టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…