Clothes Washing : మన దేశంలో అనేక రకాల ఆచార సంప్రదాయాలున్నాయి. వీటిని కొందరు మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తే మరికొందరు పాటిస్తూ ఉంటారు. కాకపోతే ప్రతి ఆచార సంప్రదాయం వెనుక ఏదో ఒక నిగూఢ విషయం ఉందనేది వాస్తవం. అలాంటిది బట్టలుతికిన నీటిని కాళ్లపై పోసుకోవడం ఒకటి. అలా చేస్తే పుట్టింటి వారికి అరిష్టం అని పెద్దలు చెపుతుంటారు. నేను కాళ్లపై పోసుకుంటే వారికి ఎలా అరిష్టం అవుతుందని మొండిగా కొందరు ప్రవర్తిస్తే మరికొందరు అలవాటు కొద్దీ ఆ పని చేస్తారు. పెద్దలు చెప్పారని కాకపోయినా దీని గురించిన కొన్ని విషయాలను ఆలోచిద్దాం.
చాలా మంది స్త్రీలు బట్టలు ఉతికిన తర్వాత జాడించేసి ఆ నీళ్లను పారబోస్తూ తమ కాళ్లపై పోసుకుంటారు. బట్టలు ఉతికిన నీళ్లను కాళ్ల మీద పోసుకుంటే కాళ్లు శుభ్రమవుతాయని భావించడం ఓ కారణం. దీనిని ఆచారం అనడం కన్నా అలవాటు అంటే బాగుంటుందేమో. స్త్రీలు ఎక్కువ కాలం నీళ్లలో ఉండటం వల్ల కాళ్లు పాడవుతాయి. నీళ్లలో నాని నాని పగుళ్లు వస్తాయి. అలాంటి పగుళ్ల ద్వారా బట్టలు ఉతికినప్పుడు వాటిలోని సూక్ష్మ క్రిములు పగుళ్ల ద్వారా వారి కాళ్లలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.
దాని ద్వారా వారు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొందరు భర్తలు భార్యలతో అడ్డమైన చాకిరీ చేయించుకుంటారు. అదే భార్యలు కాస్త అనారోగ్యానికి గురైనా చాలు వాళ్లకు సేవ చేయాల్సి వస్తుందన్న భయంతో సేవ చేసే ఓపిక లేక పుట్టింటికి పంపేస్తారు. పుట్టింటివారు కాస్త ఓపికమంతులు, స్థితిమంతులు అయితే ఫర్వాలేదు. లేకపోతే ఇబ్బందే కదా. అందుకే బట్టలు ఉతికిన నీళ్లు కాళ్లపై పోసుకోకూడదు అంటారు. పుట్టింటి వారికి ఇబ్బంది అని చెప్పే కోణంలో అరిష్టమని చెప్పి ఉండొచ్చు. ఇదీ అసలు సంగతి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…