lifestyle

Multani Mitti : ముల్తానీ మ‌ట్టిని ఇలా ఉప‌యోగించండి.. మీ చ‌ర్మం మెరిసిపోతుంది..!

Multani Mitti : ముఖాన్ని కాంతివంతంగా మార్చడంతోపాటు పలు చర్మ సమస్యలను తగ్గించడంలో ముల్తానీ మట్టి అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల చర్మం మృదువుగా కూడా మారుతుంది. బ్లాక్‌ హెడ్స్, చర్మం రంగు మారడం, ఎండ వల్ల చర్మం కందిపోవడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఉన్నవారు ముల్తానీ మట్టిని ఉపయోగించాలి. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి ముల్తానీ మట్టితో ఆయా సమస్యల నుంచి ఎలా బయట పడాలో ఇప్పుడు తెలుసుకుందామా. ఒక గిన్నెలో రెండు మూడు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టి తీసుకుని అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ చొప్పున పెరుగు, కీరదోస గుజ్జు, రెండు టీ స్పూన్ల శనగపిండిలను వేసి బాగా కలపాలి. తరువాత పాలు పోస్తూ మెత్తని మిశ్రమంగా చేయాలి. దాన్ని ముఖం, మెడకు రాయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. ప్రకాశిస్తుంది.

రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టి, ఒక టేబుల్‌ స్పూన్‌ పెరుగు, ఒకటిన్నర టీస్పూన్ల నిమ్మరసం, చిటికెడు పసుపులను తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాల్లో మాస్క్‌లా రాయాలి. తరువాత బాగా ఆరిపోయాక తడి చేత్తో రుద్దుతూ మొత్తం కడిగేయాలి. దీంతో బ్లాక్‌ హెడ్స్‌ సమస్య తగ్గుతుంది. రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీమట్టిలో అంతే మోతాదులో బంగాళాదుంపల గుజ్జును కలిపి ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. బాగా ఆరాక కడిగేయాలి. దీంతో ఎండ వల్ల రంగు మారిన చర్మం తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటుంది.

Multani Mitti

రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టిలో ఒకటిన్నర టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నీళ్లు, పావు టేబుల్‌ స్పూన్‌ చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో ఎండ వల్ల కందిన చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఒక గుడ్డు తెల్లసొనలో రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టి, కొద్దిగా నీళ్లు కలిపి మెత్తని పేస్టులా తయారు చేయాలి. దాన్ని ముఖానికి రాయాలి. అనంతరం 20 నిమిషాలు ఆగాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో చర్మం దృఢంగా ఉంటుంది. సాగిపోయినట్లు కనిపించదు.

చర్మం పొడిబారిపోయే సమస్య ఉన్నవారు రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీమట్టిలో ఒక టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం, ఒక టీస్పూన్‌ రోజ్‌ వాటర్‌ కలిపి ఆ మిశ్రమాన్ని మాస్క్‌లా వేయాలి. 30 నిమిషాల నుంచి 60 నిమిషాల పాటు ఆగాక కడిగేయాలి. దీంతో చర్మం తేమగా మారుతుంది. మృదుత్వం వస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM

విడాకుల తర్వాత గోల్డెన్ టెంపుల్‌లో హన్సిక.. వైరల్ అవుతున్న ‘కీలక’ పోస్ట్!

వ్యాపార వేత్త సోహైల్ ఖ‌తురియాతో విడాకులు తీసుకున్న అనంత‌రం హ‌న్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సంద‌ర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీల‌క పోస్టు…

Wednesday, 18 March 2026, 12:31 PM

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM