lifestyle

Chanakya Niti : ఇత‌రుల చేతిలో మోస‌పోకూడ‌దు అనుకుంటే.. చాణ‌క్య చెప్పిన ఈ టిప్స్ పాటించండి..!

Chanakya Niti : ఆఫీసుల‌న్నాక కొలీగ్‌ల మ‌ధ్య రాజ‌కీయాలు స‌హ‌జం. బాస్ లేదంటే పై అధికారి మెప్పు పొందడం కోస‌మే ఉద్యోగులంద‌రూ ప్ర‌య‌త్నిస్తారు. అయితే కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే ఇలాంటి ఆఫీస్ రాజ‌కీయాల్లో విజ‌య‌వంత‌మ‌వుతారు. కొంద‌రు మాత్రం ఇత‌ర ఉద్యోగులు చేసే జిమ్మిక్కుల్లో ప‌డి వెన‌క‌బ‌డ‌తారు. అయితే అలాంటి వారు ఆచార్య చాణ‌క్యుడు చెప్పిన కొన్ని సూత్రాల‌ను పాటిస్తే ఆఫీస్ రాజ‌కీయాల్లో త‌మ‌దైన ముద్ర‌ను వేసి పైకి ఎద‌గ‌వ‌చ్చ‌ట‌. దీంతో విజ‌యాలు కూడా సొంత‌మ‌వుతాయ‌ట‌. ఇంత‌కీ ఆఫీసు రాజ‌కీయాల్లో విజ‌యం కోసం చాణ‌క్యుడు చెప్పిన ఆ సూత్రాలు ఏమిటంటే.. అన్ని పాములు విషాన్ని క‌లిగి ఉండ‌వు. వాటిలో విషం లేనివి కూడా కొన్ని ఉంటాయి. అయితే అవి కూడా విషం ఉన్న పాముల్లాగే ప్ర‌వ‌ర్తిస్తాయి. మ‌నుషులు కూడా ఇలాంటి ప్ర‌వృత్తిని అల‌వాటు చేసుకుంటే ఆఫీసు రాజ‌కీయాల్లో పై చేయిని సాధించ‌వ‌చ్చ‌ట‌.

ఉద్యోగులెవ‌రైనా త‌మ తమ ర‌హ‌స్యాల‌ను గురించి ఇత‌రుల‌తో చ‌ర్చించ‌కూడ‌దు. వాటిని ఇత‌రుల‌కు అస్స‌లు తెలియ‌నీయ‌కూడ‌దు. లేదంటే ఇత‌రులు వాటితో పై చేయి సాధించేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈగో ఉన్న వారితో మ‌ర్యాద‌గా ఉంటూ, తెలివి ఉన్న వారితో ఎల్ల‌ప్ప‌టికీ నిజ‌మే చెబుతూ, మూర్ఖుల‌తో ఎప్ప‌టికీ వాదించ‌కుండా ఉంటుంటే వారు మీ ప‌ట్ల ఆస‌క్తి చూపుతారు. విజ‌యం మీ సొంత‌మ‌వుతుంది. ఎవ‌రైనా ఏదైనా ప‌ని చేసే ముందు 3 ప్ర‌శ్న‌ల‌ను మ‌న‌స్సులో వేసుకోవాలి. అవేమిటంటే, 1. నేను ఈ ప‌నిని ఎందుకు చేస్తున్నాను? 2. దీని ఫ‌లితం ఎలా ఉంటుంది? 3. ఇది విజ‌య‌వంతం అవుతుందా? అనే ప్ర‌శ్న‌ల‌ను వేసుకుంటే, వాటికి సంతృప్తిక‌ర స‌మాధానాలు ల‌భించాయి అనుకుంటేనే అప్పుడు ఆ ప‌నిని మొద‌లు పెట్టాలి.

Chanakya Niti

ఎవరైనా ఏదైనా ప‌ని చేస్తున్న‌ప్పుడు దాని గురించి భ‌య ప‌డ‌కూడ‌దు. మ‌ధ్య‌లో వ‌దిలేయ కూడ‌దు. చివ‌రి వ‌ర‌కు ప‌ని చేస్తేనే అలాంటి వారు సంతోషంగా, సంతృప్తిక‌రంగా ఉంటారు. బహిరంగ ప్ర‌దేశాల్లో, ప‌బ్లిక్ ఎక్కువ‌గా ఉన్న చోట మీ శ‌త్రువులపై ఎక్కువ‌గా కోపాన్ని ప్ర‌ద‌ర్శించకూడ‌దు. ఇత‌రులు చేసిన త‌ప్పుల నుంచి మ‌నం ఎల్ల‌ప్పుడూ గుణపాఠాలు నేర్చుకుంటూ ఉండాలి. లేదంటే మ‌నం జీవితంలో ఎక్కువ కాలం మ‌న‌గ‌ల‌గ‌లేం. ఏ వ్య‌క్తి అయినా మ‌రీ అత్యంత నిజాయితీ ప‌రుడై ఉండ‌కూడ‌దు. నిటారుగా ఎదిగే చెట్ల‌నే ఎక్కువ‌గా న‌రుకుతారు క‌దా. బంగారం ఎంత‌టి అస‌హ్యంలో ప‌డినా దాన్ని క‌డిగి మ‌ళ్లీ తీసుకోవాలి. అలాగే ఎంత త‌క్కువ స్థాయిలో, పేద‌రికంలో జ‌న్మించినా ప్ర‌తిభ ఉన్న వ్య‌క్తి నుంచి జ్ఞానాన్ని సంపాదించాలి.

యువ‌త శ‌క్తి, మ‌హిళ‌ల అంద‌మే ప్ర‌పంచానికి అత్యంత పెద్ద ప‌వ‌ర్ లాంటివి. చ‌దువు అనేది ప్ర‌తి మ‌నిషికి అత్యంత ఆవ‌శ్య‌కం. చదువుకున్న వ్య‌క్తిని అందరూ గౌర‌విస్తారు. ప్ర‌తి ఒక్క చోట అత‌నికి గౌర‌వం ద‌క్కుతుంది. అన్నింటి క‌న్నా చ‌దువే ముఖ్య‌మైంది. ప్ర‌తి ఫ్రెండ్‌షిప్ వెనుక ఏదో ఒక వ్య‌క్తిగత స్వార్థం లేదా ప్రేర‌ణా శ‌క్తి దాగి ఉంటుంది. ఇది న‌మ్మ‌లేని చేదు నిజం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్! స్కాట్లాండ్‌కు బంపర్ ఆఫర్..

భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…

Saturday, 24 January 2026, 5:25 PM

BSSC ఇంటర్ లెవల్ నోటిఫికేషన్ 2026: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…

Saturday, 24 January 2026, 10:15 AM

రాయ్‌పూర్ టీ20: కివీస్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం!

రాయ్‌పూర్ వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని…

Friday, 23 January 2026, 10:53 PM

పప్పులను వండే ముందు నానబెడుతున్నారా? లేదంటే డేంజరే.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న షాకింగ్ నిజాలు!

భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…

Friday, 23 January 2026, 8:02 PM

విశ్లేషణ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంకృతాపరాధం.. పాక్ మాటలు నమ్మి వరల్డ్ కప్‌కు దూరం?

ఎదుటి వ్య‌క్తి క‌ష్టాల్లో ఉంటే అత‌ని ప‌రిస్థితిని కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆస‌రాగా చేసుకుని త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలు…

Friday, 23 January 2026, 3:54 PM

మీ పాన్ కార్డు పోయిందా? స్మార్ట్‌ఫోన్‌లోనే ‘ఇ-పాన్’ డౌన్‌లోడ్ చేసుకోండి.. పూర్తి ప్రాసెస్ ఇదే!

ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…

Friday, 23 January 2026, 9:51 AM

అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…

Thursday, 22 January 2026, 4:46 PM

కేవలం రూ.9,699కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్లౌపంక్ట్ నుంచి అదిరిపోయే లాంచ్!

బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…

Thursday, 22 January 2026, 1:51 PM