యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

January 15, 2026 9:13 PM

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 2691 అప్రెంటిస్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ ను రిలీజ్ చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాల‌కు ద‌రఖాస్తు చేయ‌వ‌చ్చు. పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు శిక్ష‌ణా కాలంలో నెల‌కు రూ.15వేల స్ట‌యిపండ్ చెల్లిస్తారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న బ్యాంకుకు చెందిన శాఖ‌ల్లో ప‌నిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు గాను అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థుల వ‌య‌స్సు 20 నుంచి 28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు 5 ఏళ్లు, ఓబీసీల‌కు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు 10 ఏళ్లు గ‌రిష్ట వ‌యో ప‌రిమితిలో స‌డ‌లింపు ఇచ్చారు. ఆన్‌లైన్ రాత పరీక్ష‌, మాతృభాష‌పై ప‌ట్టు, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

Union Bank of India Apprentice Recruitment 2025 full details

ద‌ర‌ఖాస్తు ఫీజు జ‌న‌ర‌ల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్య‌ర్థులు రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మ‌హిళా అభ్య‌ర్థులు రూ.600, పీడబ్ల్యూడీ అభ్య‌ర్థులు రూ.400 అప్లికేష‌న్ ఫీజు చెల్లించాలి. ఈ పోస్టుల‌కు అప్లై చేసేందుకు మార్చి 5ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. రాత ప‌రీక్ష తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తారు. మ‌రిన్ని వివ‌రాల‌కు అభ్య‌ర్థులు https://www.unionbankofindia.co.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now