టెక్ మ‌హీంద్రాలో ఉద్యోగాలు.. డిగ్రీ పాస్ అయితే చాలు..

January 15, 2026 9:13 PM

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే టెక్ మ‌హీంద్రా కంపెనీ మీకు స‌ద‌వ‌కాశాన్ని అందిస్తోంది. ఆ సంస్థ‌లో ఖాళీగా ఉన్న ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. డిగ్రీ చ‌దివి ఉండి సంబంధిత కోర్సుల‌ను చేసి ఉంటే చాలు, టెక్ మ‌హీంద్రా కంపెనీలో జాబ్ పొంద‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు ఎంపికైన వారు హైద‌రాబాద్ కేంద్రంగా ఉన్న టెక్ మ‌హీంద్రా సంస్థ‌లో ప‌నిచేయాల్సి ఉంటుంది.

ఆస‌క్తి, అర్హ‌త ఉన్న‌వారు ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు ఈ పోస్టుల‌కు అప్లై చేసేందుకు గ‌డువు ఉంది. అంటే ఇంకా చాలా కాలం ఉంది క‌నుక అభ్య‌ర్థులు ఆయా కోర్సుల్లో శిక్ష‌ణ పొంది మ‌రీ ఈ జాబ్‌ల‌కు అప్లై చేయ‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు అప్లై చేసే అభ్య‌ర్థులు డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఐబీఎం ఏనీఐ క‌నెక్ట్ బేసిక్ స్కిల్స్‌, ఈఎస్‌క్యూఎల్‌, ఎక్స్ఎంఎల్ వంటి కోర్సుల‌ను చేసి ఉండాలి. ప‌ని అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. ఫ్రెష‌ర్స్ కూడా ఈ పోస్టుల‌కు అప్లై చేయ‌వ‌చ్చు.

software jobs in tech mahindra know how to apply and other details

ఇక ఈ పోస్టుల‌కు గాను ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. అందుకు గాను అభ్య‌ర్థులు https://careers.techmahindra.com/Registration.aspx?JobId=NQAAADkAAAAzAAAANwAAADgAAAA=-k6fqRuY78iY= అనే లింక్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. మ‌రిన్ని వివ‌రాల‌ను కూడా అభ్యర్థులు ఇదే లింక్‌లో తెలుసుకోవ‌చ్చు. క‌నుక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాల‌నుకుంటున్న వారికి ఇదొక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now