నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఎస్‌బీఐలో ఉద్యోగాలు..

January 15, 2026 9:13 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 150 స్పెష‌లిస్ట్ క్యాడ‌ర్ ఆఫీస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. మ‌రిన్ని వివ‌రాల‌కు అభ్య‌ర్థులు https://sbi.co.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌లో భాగంగా 150 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఎస్సీల‌కు 24, ఎస్‌టీల‌కు 11, ఓబీసీల‌కు 38, ఈడ‌బ్ల్యూఎస్ 15, యూఆర్ 62 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల‌కు గాను ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభం కాగా జ‌న‌వ‌రి 23వ తేదీ వ‌ర‌కు గ‌డువు విధించారు.

ఈ పోస్టుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన యూనివ‌ర్స‌టీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఐఐబీఎఫ్ ద్వారా ఫారెక్స్‌లో స‌ర్టిఫికెట్ పొందాలి. స‌ర్టిఫికెట్ తేదీ 31.12.2024 నాటికి లేటెస్ట్ అయి ఉండాలి. అభ్య‌ర్థులు పూర్తి వివ‌రాల‌ను అధికారిక నోటిఫికేష‌న్ చూసి తెలుసుకోవ‌చ్చు.

sbi Specialist Cadre Officer 2025 recruitment

అభ్యర్థుల‌ను షార్ట్ లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 100 మార్కుల‌కు ఇంట‌ర్వ్యూ ఉంటుంది. అప్లికేష‌న్ ఫీజు రూ.750 చెల్లించాలి. రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరిల‌కు చెందిన వారికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now