రైల్వేలో ఖాళీలు.. రాత ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌..

January 15, 2026 9:13 PM

మీరు రైల్వేలో ఖాళీల కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే ఈ అవ‌కాశం మీ కోస‌మే. ఎందుకంటే బీహార్‌లోని పాట్నాలో ఉన్న ఈస్ట్ సెంట్ర‌ల్ రైల్వేలో అప్రెంటిస్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) ఆధ్వ‌ర్యంలో ఈ నియామ‌క ప్ర‌క్రియ చేప‌ట్ట‌నున్నారు. ఇందులో భాగంగా ఈస్ట్ సెంట్ర‌ల్ రైల్వే ప‌రిధిలోని డివిజ‌న్‌, యూనిట్‌ల‌లో యాక్ట్ అప్రెంటిస్ శిక్ష‌ణ కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టుల‌కు గాను అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొత్తం 1154 అప్రెంటిస్ షిప్ ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. ఫిట్టర్, వెల్డర్, మెకానిక్ (డీజిల్‌), మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్‌మ్యాన్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎంఎంటీఎం, సివిల్ ఇంజినీర్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్‌ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, టర్నర్‌, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్ త‌దిత‌ర ట్రేడ్‌ల‌లో ఈ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఈ పోస్టుల‌కు గాను ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 14ను ఇందుకు చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. దనపుర్‌ డివిజన్‌, ధన్‌బాద్‌ డివిజన్‌, పండిట్‌ దీన్‌దాయాల్‌ ఉపాద్యాయ డివిజన్‌, సోన్‌పుర్‌ డివిజన్‌, సమస్తిపుర్‌ డివిజన్‌, ప్లాంట్‌ డిపోట్, క్యారేజ్‌ రిపేర్‌ వర్క్‌షాప్‌/ హర్నాట్‌, మెకానికల్‌ వర్క్‌షాప్‌/ సమస్తిపుర్ త‌దిత‌ర డివిజ‌న్లు, యూనిట్ల‌లోఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు గాను https://ecr.indianrailways.gov.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. అలాగే అప్లికేష‌న్ కోసం https://rrcrail.in/ అనే లింక్‌ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

RRC East Central Railway 1154 Apprenticeship Posts

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు కనీసం 50 శాతం మార్కులతో మెట్రిక్యులేషన్‌/ పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఎన్‌సీవీటీ జారీచేసిన నేషనల్‌ నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 15 నుంచి 24 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరిల‌కు చెందిన అభ్య‌ర్థుల‌కు గ‌రిష్ట వయో ప‌రిమితిలో స‌డ‌లింపులు ఉంటాయి. మెట్రిక్యులేష‌న్‌, ఐటీటీ మార్కులు, ధ్రువ ప‌త్రాల ప‌రిశీల‌న‌, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.100 కాగా ఆన్‌లైన్ లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now