నేషనల్ షుగర్ ఇనిస్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. 4 టెక్నికల్ పోస్టుల భర్తీ

కాన్పూర్‌లోని నేష‌న‌ల్ షుగ‌ర్ ఇనిస్టిట్యూట్ (NSI) 2026 సంవత్సరానికి గాను కొత్త రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు సాంకేతిక (టెక్నికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది.

February 21, 2026 2:15 PM
NSI Kanpur technical posts recruitment notification 2026.
కాన్పూర్ నేషనల్ షుగర్ ఇనిస్టిట్యూట్‌లో ఖాళీల భర్తీ. Photo Credit: National Sugar Institute.

కాన్పూర్‌లోని నేష‌న‌ల్ షుగ‌ర్ ఇనిస్టిట్యూట్ (NSI) 2026 సంవత్సరానికి గాను కొత్త రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు సాంకేతిక (టెక్నికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. అధికారిక ప్రకటన ప్రకారం, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో మొత్తం 4 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్ప‌వ‌చ్చు.

ఖాళీల వివరాలు..

  • రిసెర్చ్ అసిస్టెంట్ (ఇంజినీరింగ్) – 01
  • డ్రాఫ్ట్స్ మ‌న్ – 01
  • ఫైన్ మెకానిక్ – 01
  • వెల్డర్ – 01
  • మొత్తం ఖాళీలు: 04

అర్హతలు:

  • రిసెర్చ్ అసిస్టెంట్ (ఇంజినీరింగ్): గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా
  • డ్రాఫ్ట్స్‌మ‌న్: 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా (AutoCAD పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం)
  • ఫైన్ మెకానిక్: సైన్స్ విభాగంతో 12వ తరగతి, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్‌లో 2 సంవత్సరాల సర్టిఫికెట్
  • వెల్డర్: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు గుర్తింపు పొందిన వెల్డింగ్ సర్టిఫికెట్

వయో పరిమితి:

  • డ్రాఫ్ట్స్‌మ‌న్: 18 నుంచి 27 సంవత్సరాలు
  • రీసెర్చ్ అసిస్టెంట్ / ఫైన్ మెకానిక్ / వెల్డర్: 18 నుంచి 25 సంవత్సరాలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

  • సాధారణ డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు: గరిష్టంగా 40 సంవత్సరాలు
  • SC/ST డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు: గరిష్టంగా 45 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు:

జనరల్, EWS, OBC వర్గాల అభ్యర్థులు రూ.50 (రీఫండ్ ఇవ్వ‌బ‌డ‌దు) దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఈ మొత్తాన్ని Director, National Sugar Institute, Kanpur పేరుతో ఇండియన్ పోస్టల్ ఆర్డర్ (IPO) రూపంలో పంపించాలి.

అర్హతలు కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని NSI సూచించింది. టెక్నికల్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం ఆశించే వారికి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.

గ‌మ‌నిక‌: అభ్య‌ర్థులు అధికారిక నోటిఫికేష‌న్ లేదా వెబ్‌సైట్ (nsi.gov.in)ను సంద‌ర్శించి స‌మాచారాన్ని ధ్రువీక‌రించుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్‌లోనే ద‌ర‌ఖాస్తు చేయాలి. అప్‌డేట్స్ కోసం కూడా ఆ సైట్‌నే ప‌రిశీలించాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment