టెన్త్ చ‌దివిన వారికి CISF లో ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.69వేలు..

January 15, 2026 9:13 PM

ది సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. CISFలో ఖాళీగా ఉన్న మొత్తం 1124 కానిస్టేబుల్ పోస్టుల‌ను ఈ నియామ‌క ప్ర‌క్రియ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు గాను జ‌న‌ర‌ల్ విభాగంలో 460 ఖాళీలు ఉండ‌గా, ఎస్సీ 167, ఎస్టీ 83, ఓబీసీ 303, ఈడ‌బ్ల్యూఎస్ విభాగంలో 111 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల‌ను లెవ‌ల్ 3 పోస్టులుగా ప‌రిగ‌ణిస్తున్నారు. వీటికి గాను రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. 100 ప్ర‌శ్న‌ల‌కు 100 మార్కుల‌తో ప‌రీక్ష ఉంటుంది. ఈ ప‌రీక్ష‌ను 120 నిమిషాల్లో పూర్తి చేయాలి.

మొత్తం పోస్టుల్లో 845 పోస్టులు కానిస్టేబుల్‌, డ్రైవ‌ర్ పోస్టులు కాగా 279 పోస్టులు డ్రైవ‌ర్ క‌మ్ పంప్ ఆప‌రేట‌ర్ విభాగంలో ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ.21700 నుంచి రూ.69100 వ‌ర‌కు వేత‌నం చెల్లిస్తారు. అభ్యర్థులు 10వ త‌ర‌గ‌తి లేదా త‌త్స‌మాన అర్హ‌త‌ను క‌లిగి ఉండాలి. డ్రైవింగ్ వ‌చ్చి ఉండాలి. జ‌న‌ర‌ల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్య‌ర్థులు రూ.100 అప్లికేష‌న్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ల‌కు స‌డ‌లింపులు ఇచ్చారు.

CISF Constable posts for 2025 know full details

అభ్య‌ర్థుల‌కు వ‌య‌స్సు 21 నుంచి 27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. రాత ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ ఎఫిషియెన్సీ అండ్ స్టాండ‌ర్డ్ టెస్ట్‌, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల‌కు అప్లికేషన్ ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభం అయింది. ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. మార్చి 4ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు, ఆన్‌లైన్‌లో అప్లై చేసేందుకు https://cisfrectt.cisf.gov.in/index.php అనే అధికారిక వెబ్‌సైట్‌ను అభ్య‌ర్థులు సంద‌ర్శించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now