ఉద్యోగాలు

కెన‌రా బ్యాంకులో ఉద్యోగాలు.. జీతం రూ.27 ల‌క్ష‌లు..

బ్యాంకు ఉద్యోగాల‌కు సిద్ధ‌మ‌వుతున్న వారికి కెన‌రా బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. కెన‌రా బ్యాంకులో కాంట్రాక్టు బేసిస్ విధానంలో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే నోటిఫికేష‌న్‌ను కూడా రిలీజ్ చేశారు. బ్యాంకుల్లో ఉద్యోగం చేయాల‌ని భావిస్తున్న వారికి ఇదొక గొప్ప అవ‌కాశంగా చెప్ప‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకునే ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు https://canarabank.com/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు జ‌న‌వ‌రి 24ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

మొత్తం 60 ఖాళీలు ఉండ‌గా అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్ పోస్టులు 7, క్లౌడ్ అడ్మినిస్ట్రేట‌ర్ 2, అన‌లిస్ట్ 8, డేటాబేస్ అడ్మినిస్ట్రేట‌ర్ 9, డేటా ఇంజినీర్ 2, డేటా మైనింగ్ ఎక్స్‌ప‌ర్ట్ 2, డేటా సైంటిస్ట్ 2, ఎథిక‌ల్ హ్యాక‌ర్ అండ్ పెనెట్రేష‌న్ టెస్ట‌ర్ 1, ఈటీఎల్ స్పెష‌లిస్ట్ 2, జీఆర్‌సీ అన‌లిస్ట్ ఐటీ గ‌వ‌ర్నెన్స్‌, ఐటీ రిస్క్ అండ్ కంప్ల‌య‌న్స్ 1, నెట్‌వ‌ర్క్ అడ్మినిస్ట్రేట‌ర్ 6, ఆఫీస‌ర్ 7, ప్లాట్‌ఫామ్ అడ్మినిస్ట్రేట‌ర్ 1, ప్రైవేట్ క్లౌడ్ అండ్ వీఎం వేర్ అడ్మినిస్ట్రేట‌ర్ 1, సొల్యూష‌న్ ఆర్కిటెక్ట్ 1, సిస్ట‌మ్ అడ్మినిస్ట్రేట‌ర్ పోస్టులు 8 ఖాళీగా ఉన్నాయి.

డేటా అనలిస్ట్, డేటా మైనింగ్ ఎక్స్‌పర్ట్, డేటా సైంటిస్ట్, అప్లికేషన్ డెవలపర్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఆఫీసర్ ఐటీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులకు అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఐటీలో గ్రాడ్యుయేట్‌, BE / BTech కలిగి ఉండాలి. గతంలో పని చేసిన అనుభవం కూడా ఉండాలి. అభ్య‌ర్థుల‌ గరిష్ఠ వయోపరిమితి డిసెంబర్‌ 1, 2024 నాటికి 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిజర్వ్‌డ్‌ కేటగిరి అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఇచ్చారు. ఈ పోస్టుల భర్తీకి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వ‌హిస్తారు. రాత పరీక్షలో ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌తో పాటు లోకల్‌ రీజనింగ్‌పై 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ఒక్క తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్‌ మార్కు ఉంటుంది.

స్పెషల్‌ ఆఫీసర్లుగా ఎంపికైన వారికి ఏడాదికి రూ.18 లక్షల నుంచి రూ.27 లక్షల వరకు వేతనం ఉంటుంది. అంటే నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2.25 లక్షల వరకు వస్తుందన్నమాట. అభ్యర్థులు మ‌రిన్ని వివరాలకు కెనరా బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ చూడ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM