డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

January 15, 2026 9:13 PM

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ బ్యాంకుకు చెందిన ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న ప‌లు పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. మొత్తం518 పోస్టుల‌కు గాను ఈ నియామ‌క ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌నున్నారు. డిగ్రీ చ‌దివిన వారు ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభం కాగా మార్చి 11ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు అభ్య‌ర్థులు https://www.bankofbaroda.in/ అనే అధికారిక సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ విభాగంలో 350 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. బిజినెస్ అండ్ ఫారెక్స్‌లో 97, రిస్క్ మేనేజ్‌మెంట్ లో 35, సెక్యూరిటీలో 36 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి డిగ్రీ చ‌దివి ఉండ‌డంతోపాటు సంబంధిత విభాగంలో నైపుణ్యం ఉండాలి. ఐటీ, బిజినెస్‌, ఫైనాన్స్‌, రిస్క్ మేనేజ్‌మెంట్‌, సెక్యూరిటీ రంగాల్లో నైపుణ్యం లేదా ప‌ని అనుభ‌వం ఉన్న వారికి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు.

Bank of Baroda Managerial Posts Recruitment 2025 full details

ఈ పోస్టుల‌కు గాను అభ్య‌ర్థుల‌ను ఆన్‌లైన్ టెస్ట్‌, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్‌, గ్రూప్ డిస్క‌ష‌న్ లేదా ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మ‌రిన్ని వివ‌రాల‌కు లేదా పూర్తి స‌మాచారం కోసం అధికారిక సైట్‌లో ఇచ్చిన లింకును సంద‌ర్శించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now