28 జూలై 2021 (బుధ‌వారం).. రాశి ఫ‌లాలు..

July 27, 2021 9:58 PM

జూలై 28 బుధవారం చంద్రుడు బృహస్పతి రాశి అయిన మీనంలో ప్రవేశించనున్నాడు. ఈ రాశిలో చంద్రుడి ఆగమనం వల్ల కొన్ని రాశుల వారికి శుభం క‌లుగుతుంది. ఈ క్ర‌మంలో రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

28th july 2021 rashi phalalu

మేషం: వీరికి ఈ రోజు స‌మాజంలో గౌర‌వం, మ‌ర్యాద ద‌క్కుతాయి. రియ‌ల్ ఎస్టేట్ వారికి క‌ల‌సి వ‌స్తుంది. త‌ల్లిదండ్రుల బ‌లంతో ప‌నులు పూర్తి చేస్తారు. త‌ల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. స్నేహితుల‌తో గ‌డిపే అవ‌కాశం ఉంది.

వృష‌భం: వీరికి ఈ రోజు వ్యాపారంలో అనుకూలిస్తుంది. జీవిత భాగ‌స్వామితో బంధం బ‌ల‌ప‌డుతుంది. నూత‌న అవ‌కాశాలు ల‌భిస్తాయి. ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు. స్నేహితుల‌తో క‌ల‌సి ప్ర‌యాణం చేస్తారు.

మిథునం: వీరికి రావ‌ల్సిన డ‌బ్బు ఆగిపోతుంది. తెలివితేట‌ల‌తో నిర్ణ‌యాలు తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది. సాయంత్రం శుభం క‌లుగుతుంది. వివాదాల‌కు దూరంగా ఉంటే మంచిది.

క‌ర్కాట‌కం: క‌ష్ట‌ప‌డితే ప‌నిలో విజయం సాధిస్తారు. ఖ‌ర్చు ఎక్కువ‌గా చేసే అవ‌కాశం ఉంది. డ‌బ్బు అందే సూచ‌న‌లు ఉన్నాయి. సాయంత్రం ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంది.

సింహం: ఈ రోజు వీరు దాన ధ‌ర్మాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్ర‌మాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంది. చేప‌ట్టిన ప‌నుల‌ను పూర్తి చేస్తారు. కుటుంబంతో సంతోషంగా గ‌డుపుతారు.

క‌న్య‌: వీరికి ఈ రోజు ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంది. జీవిత భాగ‌స్వామి నుంచి స‌హకారం ల‌భిస్తుంది. ప‌నుల్లో విజ‌యం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

తుల‌: వీరు ఈ రోజు చ‌దువు ప‌ట్ల ఆసక్తిని ప్ర‌ద‌ర్శిస్తారు. నూత‌న విష‌యాల‌ను తెలుసుకుంటారు. ప్రేమికుల‌కు శుభ‌క‌రం. స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయి. ఆర్థ‌క లావాదేవీల ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాలి.

వృశ్చికం: వీరికి ఈ రోజు ఆదాయం త‌గ్గుతుంది. ఖ‌ర్చులు ఎక్కువ అవుతాయి. పిల్ల‌ల వల్ల గౌర‌వ మ‌ర్యాద‌లు వ‌స్తాయి. సంప‌ద పెరిగే అవ‌కాశం ఉంది. నూత‌న వ్యాపారం ప్రారంభించ‌వ‌చ్చు. విద్యార్థుల‌కు అనుకూలం. ఇష్ట‌మైన వారితో గ‌డుపుతారు.

ధ‌నుస్సు: వీరి తెలివి తేట‌లు, జ్ఞానం పెరుగుతాయి. గౌర‌వ మ‌ర్యాద‌లు ల‌భిస్తాయి. ప్రేమికుల‌కు శుభం జ‌రుగుతుంది. కుటుంబ ప‌రిచయాల ద్వారా లాభం క‌లుగుతుంది. సోద‌రుల స‌హాయంతో ప‌నులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

మ‌క‌రం: వీరు త‌మ పూర్వీకుల నుంచి సంప‌ద పొందే అవ‌కాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబ‌డులు పెడితే లాభం క‌లుగుతుంది. ఆర్థికంగా క‌ల‌సి వ‌స్తుంది.

కుంభం: వీరు ఆదాయం పెంచుకుంటారు. ఆర్థిక స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. నూత‌న ప‌నుల‌ను ప్రారంభిస్తారు. అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది. స్నేహితుల స‌హ‌కారం ఉంటుంది.

మీనం: వీరికి సంప‌ద పెరుగుతుంది. గౌర‌వ మ‌ర్యాద‌లు ల‌భిస్తాయి. స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయి. జీవిత భాగ‌స్వామి నుంచి స‌హ‌కారం అందుతుంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌రాదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment