Yellow Teeth : ప్రస్తుత తరుణంలో అధిక శాతం మంది దంతాల సమస్యలతో బాధపడుతున్నారు. దంతాల సైజు సరిగ్గా లేదని కొందరు.. దంతాలు సరిగ్గా పెరగడం లేదని కొందరు.. పసుపు, గారతో ఉన్నాయని కొందరు బాధపడుతున్నారు. అయితే మిగిలిన సమస్యలు ఎలా ఉన్నా సరే.. పసుపు రంగులో ఉన్న దంతాలను మాత్రం తెల్లగా మార్చుకోవచ్చు. అందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఒక చిన్న చిట్కా పాటిస్తే చాలు.. మూడంటే మూడు నిమిషాల్లోనే మీ పసుపు రంగు దంతాలు తెల్లగా మారుతాయి. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని ఒక బౌల్ లో వేసుకోవాలి. దాంట్లో నిమ్మరసం పిండి బాగా కలపాలి. కలిపిన తర్వాత నురగలు పోయే వరకు ఆగి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దంతాలపై వేళ్లతో కానీ.. పేపర్ లేదా దూదితో కానీ రుద్దాలి. తరువాత 5 నిమిషాల పాటు అలాగే ఉండాలి. అనంతరం నోట్లో నీళ్లను పోసి బాగా శుభ్రం చేయాలి. ఇలా తరచూ చేయాల్సి ఉంటుంది.
అయితే ఈ చిట్కాను పాటించడం వల్ల పసుపు రంగులో ఉండే దంతాలు తెల్లగా మారుతాయి. పసుపు దనం తక్కువగా ఉంటే చాలా త్వరగానే ఈ చిట్కా పనిచేస్తుంది. కానీ పసుపు దనం, గార అధికంగా ఉంటే మాత్రం ఎక్కువ సార్లు ఈ చిట్కాను పాటించాల్సి ఉంటుంది. దీంతో దంతాలు తెల్లగా మిలమిలా మెరుస్తాయి. అలాగే దంతాలు, చిగుళ్లు, నోటి సమస్యలు ఉండవు. దంతాల ఆరోగ్యం మెరుగు పడుతుంది. చిగుళ్లు దృఢంగా ఉంటాయి.
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…