High BP : హైబీపీ.. నేడు ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది కూడా ఒకటి. నిత్యం వివిధ సందర్భాల్లో ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళన, పనిభారం, ఇతరత్రా అనేక సమస్యల కారణంగా నేడు చాలా మంది హైబీపీ బారిన పడుతున్నారు. దీంతో అది గుండె జబ్బుల వంటి ఇతర అనారోగ్యాలకు దారి తీస్తోంది. అయితే రోజూ వ్యాయామం చేయడంతోపాటు కింద ఇచ్చిన పలు ఆహార పదార్థాలను తీసుకుంటే దాంతో హైబీపీ బారి నుంచి బయట పడవచ్చు. తద్వారా మెరుగైన ఆరోగ్యం పొందవచ్చు. ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ద్రాక్ష పండ్లలో పొటాషియం, పాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హై బీపీని ఇట్టే తగ్గిస్తాయి. పొటాషియం సహజ సిద్ధమైన డై యురెటిక్ అవడం వల్ల కిడ్నీల నుంచి వ్యర్థ పదార్థాలు వెళ్లిపోతాయి. ప్రధానంగా సోడియం తొలగింపబడుతుంది. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడమే కాదు, హైబీపీ కూడా తగ్గుతుంది. పొటాషియం అధికంగా ఉండే పదార్థాల్లో అరటి పండు మొదటి స్థానంలో నిలుస్తుంది. హైబీపీ ఉంటే ఒక అరటి పండు తిన్నా చాలు, వెంటనే బీపీ అదుపులోకి వచ్చేస్తుంది. దీంతోపాటు అరటి పండ్లలో విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నిషియం కూడా సమృద్ధిగానే ఉంటాయి. అందువల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది.
హైబీపీని అదుపు చేయడంలో ఉల్లిపాయలు అమోఘంగా పనిచేస్తాయి. వీటిలో అడినోసిన్ అనే మజిల్ రిలాక్సంట్ ఉంటుంది. ఇది బీపీని కూడా అదుపులోకి తెస్తుంది. నిత్యం ఒక పచ్చి ఉల్లిపాయను అలాగే తింటున్నా లేదంటే దాన్ని జ్యూస్ తీసుకుని తాగినా రెండు వారాల్లో హైబీపీ తగ్గుముఖం పడుతుంది. రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించి రక్త సరఫరాను మెరుగు పరిచే గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. దీని వల్ల బీపీ కూడా అదుపులోకి వస్తుంది. నిత్యం రెండు వెల్లుల్లి రెబ్బల్ని తింటుంటే చాలు, హై బీపీ తగ్గుముఖం పడుతుంది. లేదంటే వాటిని జ్యూస్ తీసుకుని అయినా తాగవచ్చు. దీంతో శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కూడా పోతుంది. గుండె సమస్యలు రావు.
సోడియం, కాల్షియం, విటమిన్ సి వంటి అనేక పోషకాలతోపాటు కొబ్బరి నీటిలో పొటాషియం కూడా పుష్కలంగానే ఉంటుంది. ఇది హై బీపీని వెంటనే అదుపులోకి తెస్తుంది. కొన్ని కొబ్బరి నీళ్లు తాగితే చాలు, బీపీ నియంత్రణలోకి వస్తుంది. పుచ్చకాయల్లో అర్గినైన్ అనే అమైనో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది హై బీపీని కంట్రోల్ చేస్తుంది. కొద్దిగా పుచ్చకాయ తిన్నా లేదంటే దాని జ్యూస్ తాగినా చాలు, బీపీ అదుపులోకి వస్తుంది. అంతేకాదు రక్తం గడ్డకట్టకుండా చూసే గుణాలు పుచ్చకాయలో ఉన్నాయి. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది.
యాంటీ మైక్రోబియల్, యాంటీ డిప్రెసెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కొత్తిమీరలో ఉన్నాయి. ఇవి బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్, బీపీలను తగ్గిస్తాయి. పుదీనాలోని ఔషధ గుణాలు రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తాయి. దీంతో రక్త సరఫరా మెరుగుపడి బీపీ అదుపులోకి వస్తుంది. హై బీపీ ఉంటే కొంత నిమ్మరసం తాగినా చాలు వెంటనే బీపీ అదుపులోకి వస్తుంది. ఇందులో విటమిన్ సితోపాటు మరెన్నో పోషకాలు ఉండడం వల్ల రక్త సరఫరా కూడా మెరుగు పడుతుంది. దీంతో బీపీ కంట్రోల్ అవుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…