Pineapple : మనకు మార్కెట్‌లో తక్కువ ధరకే అందుబాటులో ఉన్న పండ్లలో పైనాపిల్ ఒకటి. దీని వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఎన్నో విటమిన్లు, మినరల్స్ ఈ పండ్లలో ఉన్నాయి. అన్ని సీజన్లలోనూ పైనాపిల్ మనకు విరివిగా దొరుకుతుంది. అయితే పైనాపిల్‌ను తింటే ఎవరికైనా నాలుక అంతా పగిలినట్టు అవుతుంది. దీంతోపాటు నాలుకపై దురద కూడా పుడుతుంది. మంట వస్తుంటుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పైనాపిల్ పండును తిన్నప్పుడు నాలుకంతా పగులుతుంది. కొంత మందికి మంట, దురదగా కూడా అనిపిస్తుంది. అందుకు కారణం ఏమిటంటే బ్రొమిలెయిన్ అనే రసాయనమే. అయితే దీంతో మనకు ఎలాంటి అపాయం లేదు. అంతా మేలే జరుగుతుంది. పైనాపిల్ పండును తిన్నప్పుడు అందులోంచి బ్రొమిలెయిన్ రసాయం విడుదలై అది కెమికల్ రియాక్షన్ వల్ల మళ్లీ వివిధ రసాయనాలుగా మారుతుంది. దీంతోపాటు నాలుకపై ఉండే ప్రోటీన్ విడిపోతుంది. అందువల్లే మనకు పైనాపిల్‌ను తిన్నప్పుడు అలా నాలుక దురదగా ఉంటుంది. పగులుతుంది. ఈ క్రమంలో పైనాపిల్‌ను తినడం వల్ల మన శరీరంలో చేరే బ్రొమిలెయిన్ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది.
అంటే నొప్పులు, వాపులను తగ్గిస్తుందన్నమాట. అంతేకాదు దీంట్లో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉన్నాయి. అంటే వృద్ధాప్యం కారణంగా చర్మంపై వచ్చే ముడతలను తగ్గిస్తుందన్నమాట. దీంతో ఎల్లప్పుడూ యంగ్‌గా ఉండవచ్చు. అదేవిధంగా బ్రొమిలెయిన్ వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఫుడ్ అలర్జీలు పోతాయి. ఆస్తమా, సైనస్, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. ఇన్ని ప్రయోజనాలు మనకు పైనాపిల్‌ను తినడం వల్ల కలుగుతాయి.
అయితే పైనాపిల్‌ను తిన్నప్పుడు మన నాలుక పగలకుండా, మంట పుట్టకుండా, దురదగా ఉండకుండా చేసుకునేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. ఓవెన్ గ్రిల్‌పై పైనాపిల్ ముక్కలను వేసి గ్రిల్ చేసుకుని తింటే నోరు పగలదు. పైనాపిల్ ముక్కలు మృదువుగా లోపలికి వెళ్లిపోతాయి. అదే విధంగా పైనాపిల్ ముక్కలపై కొద్దిగా ఉప్పు లేదా కారం చల్లుకుని తిన్నా నాలుక పగలదు. మంట పుట్టదు. ఇంకో టిప్ ఏంటంటే పైనాపిల్‌ను కోసేటప్పుడు పొట్టు రాకుండా చూసుకోవాలి. అలా పొట్టు రాకుండా పైనాపిల్ ముక్కలను కోసుకుని తిన్నా చాలు మన నోరు పగలదు. కనుక ఇక ముందు మీరు పైనాపిల్ ను తినేటప్పుడు ఈ టిప్స్ పాటించి చూడింది. దీంతో నోరు పగలకుండా చూసుకోవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…