Natural Mosquito Repellent : డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా.. వంటి డేంజరస్ రోగాలకు కారణం దోమలు. వీటి బాధ పడలేక చాలామంది రాత్రి వేళ దోమల కాయిల్స్ ను కాల్చడమో.. మస్కిటో రీఫిల్స్ ను వాడడమో చేస్తుంటారు. అయితే చాలా మందికి వీటి పొగ, వాసన వల్ల ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి. కొంత మంది ప్రతీసారి అంత డబ్బు పెట్టి కూడా వాటిని కొనే స్థోమతలో ఉండరు. కారణం ఏదైనా వాటిని భరించడం తప్పట్లేదు. అయితే ఈ సారి మీరు బయట మార్కెట్‌లో లభించే మస్కిటో రీపెల్లెంట్స్ లాంటివి కొనకుండా మీ ఇంట్లోనే ఉండే పదార్థాలతోనే అత్యంత సహజసిద్ధంగా మస్కిటో రీపెల్లెంట్‌ను తయారు చేసుకోవచ్చు. దీన్ని చేయడం కూడా సులభమే.
ఈ మస్కిటో రీపెల్లెంట్ మూలల్లో దాగిఉన్న దోమలను తరిమికొడుతుంది. దీని కోసం మనకు ఒక పాత మస్కిటో రీపెల్లెంట్ రీఫిల్ ఉంటే చాలు. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. పాత మస్కిటో రీపెల్లెంట్‌కు చెందిన రిఫీల్స్ ను తీసుకొని వాటి మూతను తీసేయాలి. ఖాళీగా ఉన్న రీఫిల్ లో 3-4 పూజకు ఉపయోగించే కర్పూరం బిళ్లలు వేసి అవి మునిగేటట్టు వేప నూనె పోయాలి. వేపనూనె అన్ని ఆయుర్వేద షాప్ లలో దొరుకుతుంది. ఇప్పుడు రీఫిల్ నుండి తీసిన మూతను ఫిక్స్ చేయాలి. సాధారణంగా రీఫిల్స్ ను ఎలా వాడుతామో అలాగే వీటిని కూడా మెషిన్ లో ఫిక్స్ చేసి స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది. దీంతో సహజసిద్ధమైన మస్కిటో రీపెల్లెంట్ రెడీ అయినట్లే. ఇది ఎంతో మెరుగా పనిచేస్తుంది.
ఇలా మనం సొంతంగా మస్కిటో రీపెల్లెంట్‌ను తయారు చేసుకోవచ్చు. మాటి మాటికీ బయట రీఫిల్స్‌ను కొనాల్సిన పనిలేకుండా ఇలా ఇంట్లోనే వాటిని తయారు చేసి వాడవచ్చు. దీంతో మన ఆరోగ్యం కూడా దెబ్బ తినకుండా ఉంటుంది. పైగా దోమలు కూడా పారిపోతాయి. ఇక ఈ రీఫిల్ వల్ల కేవలం దోమలు మాత్రమే కాదు.. ఇతర కీటకాలు, పురుగులు, సూక్ష్మ క్రిములు కూడా చనిపోతాయి. కర్పూరం వాసన కారణంగా శ్వాస చాలా ఫ్రీగా ఆడుతుంది. అలాగే వేప నూనె వాసన వల్ల శరీరంలోని హానికర బ్యాక్టీరియా చనిపోతుంది. కృతిమ రీపెల్లెంట్స్ వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనం తయారు చేసిన దాని వల్ల ఎటువంటి రోగాలు రావు. పైగా చిన్న పిల్లలున్న ఇంట్లో కూడా ఇది వాడొచ్చు. దీంతో ఓ వైపు దోమలను తరిమికొడుతూనే మరోవైపు మనం మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…