ఆధ్యాత్మికం

Mauli Thread : ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

Mauli Thread : ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులు క‌లిపి ఒకే తాడులో ఉండే దారం గురించి మీకు తెలుసు క‌దా..! అదేనండీ.. పూజ‌లు, వ్ర‌తాలు చేసిన‌ప్పుడు, శుభ కార్యాల‌ప్పుడు చేతుల‌కు క‌డ‌తారు క‌దా. అదే.. ఇక దేవాల‌యాల్లో క‌ల్యాణాల వంటివి చేయించిన‌ప్పుడు కూడా పూజారులు చేతుల‌కు క‌డ‌తారు, అవే దారాలు. అవును, ఆ దారాన్నే మౌళి అంటారు. అందులో ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులు క‌లిపి ఒక‌దాని త‌రువాత ఒక‌టి ఉంటాయి. అయితే నిజానికి అస‌లు ఆ దారం క‌ట్ట‌డం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో తెలుసా..? దాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ‌మ‌హావిష్ణువు అవ‌తారాల్లో ఒక‌టైన వామ‌నావ‌తారం గురించి తెలుసు క‌దా. బ‌లి చ‌క్ర‌వ‌ర్తి వ‌ద్ద‌కు ఆయ‌న వ‌చ్చి వ‌రం కోరుకుంటాడు. మూడ‌డుగుల స్థలం కావాల‌ని అడగ్గానే వామ‌నుడు ఒక అడుగును భూమిపై, మ‌రో అడుగుపై ఆకాశంపై పెడ‌తాడు. ఇక మూడో అడుగు ఎక్క‌డ పెట్టాలి అని వామ‌నుడు అడిగితే అప్పుడు బ‌లి ఏ మాత్రం సందేహించ‌కుండా త‌న నెత్తిన పెట్ట‌మంటాడు. దీంతో వామ‌నుడు త‌న కాలిని బ‌లి నెత్తిన పెట్ట‌గానే అత‌ను పాతాళంలోకి పోతాడు. దీంతో బ‌లి దాన గుణానికి మెచ్చిన‌ వామ‌నుడు బ‌లికి మృత్యుంజ‌యుడిగా ఉండేలా వ‌రం ఇస్తూ పైన చెప్పిన ఆ మౌళి అనే దారాన్ని క‌డ‌తాడ‌ట‌. అందుక‌ని అప్ప‌టి నుంచి దాన్ని చేతుల‌కు క‌డుతూ వ‌స్తున్నారు.

Mauli Thread

అలా మౌళి దారం క‌డితే ఎవ‌రికైనా కీడు జ‌ర‌గ‌ద‌ట‌. మృత్యువు అంత త్వ‌ర‌గా స‌మీపించ‌ద‌ట‌. ఎక్కువ కాలం సుఖంగా బ‌తుకుతార‌ట‌. సాక్షాత్తూ బ్ర‌హ్మ‌, విష్ణు, మ‌హేశ్వ‌రులు, వారి భార్య‌లైన స‌ర‌స్వ‌తి, ల‌క్ష్మి, పార్వ‌తిలు అండ‌గా ఉంటార‌ట‌. ఏ కష్టాల‌ను రానివ్వ‌ర‌ట‌. అందుక‌నే మౌళి దారాల‌ను క‌డ‌తారు. ఇదీ.. ఆ దారం క‌ట్ట‌డం వెనుక ఉన్న ఉద్దేశం. ఇక అవే రంగులు ఎందుకంటే.. ఆ మూడు రంగులు న‌వ‌గ్ర‌హాల్లో మూడింటిని ప్ర‌తిబింబిస్తాయి. అవి బృహ‌స్ప‌తి, కుజుడు, సూర్యుడు. వీరు వ్య‌క్తుల ఐశ్వ‌ర్యానికి, సుఖానికి, విద్య‌కు, ఆరోగ్యానికి కార‌కుల‌ట‌. అందుక‌ని ఆ గ్ర‌హ పీడ ఉండొద్ద‌నే ఉద్దేశంతో ఆ రంగుల‌తో ఉన్న మౌళి దారాన్ని క‌డ‌తారు. ఇక దీన్ని మ‌గ‌వారికి కుడి చేతికి క‌డ‌తారు. ఆడ‌వారికి ఎడ‌మ చేతికి క‌డ‌తారు. పెళ్లి కాని ఆడ‌వారైతే వారికి కూడా కుడి చేతికే క‌డ‌తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM