Thyroid Symptoms : మీకు తెలుసా.. ఏదైనా వ్యాది మనల్ని అటాక్ చేయడానికి ముందు మన శరీరం మనకు సిగ్నల్స్ ఇస్తుంది. చిన్న చిన్న సమస్యలే కదా అని లైట్ తీసుకుంటే అవి పెద్దగా పరిణమించే అవకాశాలుంటాయి. పదేళ్ల క్రితం థైరాయిడ్ సమస్య వల్ల మూడు శాతం మంది ఇబ్బందులు పడేవారు. కానీ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలిన విషయం ఏంటంటే ప్రతి ఏటా పన్నెండు మిలియన్ల మంది థైరాయిడ్ బారిన పడుతున్నారని తేలింది. కాబట్టి మన శరీరం ఇచ్చే సంకేతాలను బట్టి ముందుగానే సమస్యను గుర్తిస్తే కొంతవరకైనా సురక్షితంగా బయటపడే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉందని సూచించే తొమ్మిది లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నెమ్మదించిన జీవక్రియ వలన మీ శరీరం చెమటపట్టకుండా ఉండి చర్మం పొడిబారడం, దురద పుట్టడం లాంటి లక్షణాలు కనపడతాయి. దాంతోపాటు ఎక్కువ సంఖ్యలో మీ జుట్టు రాలడం కూడా థైరాయిడ్ సంకేతంగా భావించవచ్చు. థైరాయిడ్ మన శృంగార జీవితంపై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల మీకు శృంగారం పైన ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కాబట్టి మీరు శృంగారం పట్ల ఇంతకు ముందులా యాక్టివ్ గా ఉన్నారా లేదా గమనించుకోండి. మీరు బరువు పెరగడానికి మీ ఆహార పద్దతి ఒక కారణం అయితే ఎటువంటి కారణం లేకుండా మీరు బరువు పెరిగినా, ఆకలి బాగా ఉండి ఎంత తింటున్నా బరువు తగ్గుతున్నా కూడా థైరాయిడ్ లక్షణమే.
థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అయ్యే పరిమాణంపైనే మీ మూడ్ కూడా ఆధారపడి ఉంటుంది. అకారణంగా ఎవరిపైన అయినా కోపం వస్తున్నా.. అలసటగా ఫీల్ అవ్వడం, డిప్రెషన్ కు గురికావడం.. థైరాయిడ్ లక్షణాలని చెప్పవచ్చు. కాళ్లు, చేతులు వణకడం.. ఎక్కువగా తిమ్మిరులు రావడం, అరికాళ్లు, అరిచేతులు ఎక్కువగా చెమట పట్టడం అనేది థైరాయిడ్ హార్మోన్ ప్రభావం వలనే జరుగుతుంది. హైపో థైరాయిడిజం ముఖ్య లక్షణం జీర్ణక్రియ అస్తవ్యస్తంగా మారడం. తత్ఫలితంగా మలబద్దకం సమస్య ఎదురవుతుంది. అంతకుముందు మీకు ఎటువంటి జీర్ణ సమస్యలు, మలబద్దకం లాంటివి లేకుండా ఉంటే ఈ సమస్యను థైరాయిడ్ లక్షణంగా పరిగణించాలి.
తరచుగా మీ హార్ట్ బీట్ ఎక్కువగా ఉన్నా.. గుండెల్లో వణుకుగా అనిపించినా కూడా డాక్టర్ ను సంప్రందించాలి. హైపోథైరాయిడిజం వలన మీ కంటి చూపు మసకబారినట్టుగా ఉంటుంది. మీ మెదడు కూడా ఇంతకు ముందులా యాక్టివ్ గా ఉండకుండా బద్దకం ఆవహించినట్టుగా అనిపిస్తుంటుంది. రోజువారీ పనులలో కూడా యాక్టివ్ గా ఉండలేక ఎప్పుడూ నిద్ర వస్తున్న ఫీలింగ్ లో ఉండడం, బద్దకంగా ఉండడం కూడా థైరాయిడ్ లక్షణాలు అని చెప్పవచ్చు. కనుక ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే వాటిని థైరాయిడ్‌గా అనుమానించాలి. వెంటనే టెస్టులు చేయించుకోవాలి. థైరాయిడ్ ఉందని తేలితే డాక్టర్ సూచన మేరకు మందులను వాడుకోవాలి. దీంతో సురక్షితంగా ఉండవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…