టెక్నాల‌జీ

Smart Phone Camera Tricks : మీ ద‌గ్గ‌ర ఎలాంటి ఫోన్ ఉన్నా స‌రే.. ఈ 10 ట్రిక్స్ పాటిస్తే చాలు.. ఫొటోలు అద్భుతంగా వ‌స్తాయి..!

Smart Phone Camera Tricks : స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు, ఫొటోలు తీయ‌డం, సోష‌ల్ సైట్ల‌లో పెట్ట‌డం, లైకులు, కామెంట్లు కొట్టించుకోవ‌డం నేడు ఎక్కువైపోయింది. ఇక మ‌రీ సెల్ఫీలు రాగానే ఆ యావ ఇంకా ఎక్కువైంద‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే ఎంత స్మార్ట్‌ఫోన్ అయినా, ప‌వ‌ర్‌ఫుల్ కెమెరా ఉన్నా.. కొన్ని సార్లు మ‌నం వాటిల్లో తీసే ఫొటోలు నాసిర‌కంగా వ‌స్తాయి. అందుకు కార‌ణాలు అనేకం ఉంటాయి. అయితే అలా ఫొటోలు నాసిర‌కంగా రాకుండా, మంచి క్వాలిటీతో రావాలంటే అందుకు కింద చెప్పిన ప‌లు టిప్స్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌రి ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

సెల్ఫీలు తీసుకోవ‌డంలో కొన్ని సార్లు ఇబ్బందులు వ‌స్తుంటాయి. సాధారణ‌ ఫొటోలు అయినా స‌రే ఒక్కోసారి స‌మ‌స్య అవుతుంది. ఈ క్ర‌మంలో ఫొటోలో అంద‌రూ రావాలి ఎవ‌రూ మిస్ కాకూడ‌దు, అనే ప్రాబ్లం కూడా వ‌స్తుంటుంది. అలాంట‌ప్పుడు ఫొటో ఎవరు తీస్తారు అని అంద‌రూ సందేహిస్తుంటారు. అయితే అంత‌లా ఇబ్బంది ప‌డాల్సిన ప‌నిలేదు. చిత్రంలో చూపిన‌ట్టుగా ఒక ప్లాస్టిక్ కార్డును రెండు మ‌డ‌త‌లు వ‌చ్చేట్టుగా మ‌డ‌వాలి. ఒక మ‌డ‌త‌లో ఫోన్ పెట్టాలి. అనంత‌రం టైమ‌ర్ ఉప‌యోగించి ఫొటో తీసుకోవ‌చ్చు. దీంతో ఎవ‌రూ మిస్ కాకుండా అంద‌రూ ఒకే ఫొటోలో వ‌స్తారు.

Smart Phone Camera Tricks

చిత్రంలో చూశారుగా. దాన్నే మినియేచ‌ర్ ఎఫెక్ట్ అంటారు. ఈ ఎఫెక్ట్ కావాలంటే డీఎస్ఎల్ఆర్ కెమెరాయే అవ‌స‌రం లేదు, మీ స్మార్ట్ ఫోన్ ఉన్నా చాలు. దాంట్లో రోల్ వ‌ర‌ల్డ్ అనే యాప్ వేసుకుంటే దాంతో చిత్రంలో ఇచ్చిన‌ట్టుగా మినియేచ‌ర్ ఎఫెక్ట్‌తో ఫొటోలు తీసుకోవ‌చ్చు.

ఒక్కోసారి ఫొటోల‌కు త‌గినంత కాంతి అవ‌స‌రం అవుతూ ఉంటుంది. కానీ బ్యాక్‌గ్రౌండ్, ప్లేస్ మార్చ‌లేం. అలాంట‌ప్పుడు కాంతి కోసం టిన్ లేదా సిల్వ‌ర్ ఫాయిల్‌ను ఉప‌యోగించి దానిపై లైట్ ప‌డేలా చేసి దాని నుంచి వ‌చ్చే కాంతిని స‌బ్జెక్ట్‌పై ప‌డేలా చేస్తే చాలు, దాంతో ఫొటోలు క్వాలిటీగా వస్తాయి.

చిన్న‌పాటి టార్చిలైట్ లేదా లేజ‌ర్ పాయింట‌ర్‌కు ఉండే లెన్స్‌ను తీయండి. వాటిని ఫోన్ కెమెరాపై ఫిక్స్ చేయండి. అనంత‌రం ఫోన్‌తో ఫొటోలు తీస్తే చిత్రంలో ఇచ్చిన‌ట్టుగా మాక్రో షాట్స్ వ‌స్తాయి. ఇలాంటి షాట్స్ తీసి మీరు మీ స్నేహితులను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌వ‌చ్చు.

ఈ మ‌ధ్య కాలంలో డ్రోన్ కెమెరాల‌ను వాడ‌డం స‌ర్వ సాధార‌ణం అయిపోయింది. దీంతో ఫొటోలు బాగా వ‌స్తాయి. గాలిలో నుంచి కింద‌కు ఫొటోలు తీయ‌వ‌చ్చు. అయితే డ్రోన్ అక్క‌ర్లేకున్నా మీ స్మార్ట్ ఫోన్‌తో అలాంటి ఫొటోలు తీయ‌వ‌చ్చు. అందుకు ఒక హీలియం బెలూన్‌ను తీసుకుని దానికి టేప్‌తో స్మార్ట్‌ఫోన్‌ను అంటించాలి. అనంత‌రం బెలూన్‌ను గాలిలోకి ఎగ‌రేసి టైమ‌ర్ స‌హాయంతో ఫొటోలు తీయ‌వ‌చ్చు. అయితే ఈ ట్రిక్ చేసేట‌ప్పుడు ఫోన్‌ను బెలూన్ కు గ‌ట్టిగా అతికించాలి. లేదంటే కింద ప‌డి ప‌గిలేందుకు అవ‌కాశం ఉంటుంది. ఎందుకైనా మంచిది ఈ ట్రిక్ పాటించేట‌ప్పుడు ఫోన్‌కు ప్రొటెక్ష‌న్ కేస్ వేయండి.

స్మార్ట్ ఫోన్ కెమెరా యాప్‌లో ప‌లు ర‌కాల ఫిల్ట‌ర్లు ఉంటాయి. వాటితో భిన్న‌మైన క‌ల‌ర్ షేడ్స్ వ‌చ్చేలా ఫొటోలను తీసుకోవ‌చ్చు. అయితే అలా కాకుండా క‌ల‌ర్ పేప‌ర్స్‌ను క‌లిపి ఫోన్ కెమెరా లెన్స్‌కు అడ్డుగా పెట్టి వాటితో కూడా భిన్న‌మైన క‌ల‌ర్ షేడ్స్ వ‌చ్చేలా ఫొటోల‌ను తీయ‌వ‌చ్చు. అయితే ఇలా తీసిన ఫొటోలు నాచుర‌ల్ అనిపిస్తాయి.

మీరు వాడే స‌న్ గ్లాసెస్‌ను ఫోన్ కెమెరాకు అడ్డుగా పెట్టి ఫొటోలు తీస్తే ఆ ఫొటోలు పోల‌రైజ్డ్ ఎఫెక్ట్ తో వ‌స్తాయి. చూసేందుకు ఆ ఫొటోలు బాగుంటాయి.

నేటి త‌రుణంలో వ‌స్తున్న అనేక ఫోన్ల‌లో కెమెరా యాప్‌ల‌లో హెచ్‌డీఆర్ ఫీచ‌ర్ ల‌భిస్తోంది. దీంతో ఫొటోలు తీసేందుకు య‌త్నించండి. బాగా క‌ల‌ర్‌ఫుల్‌గా వ‌స్తాయి. కాంతి ఎక్కువ‌గా ఉన్న ప్ర‌దేశాల్లో ఈ ఫీచ‌ర్‌తో ఫొటోలు తీస్తే అవి నాణ్యంగా వ‌స్తాయి.

మీ ఫోన్‌తో మీరు అండ‌ర్ వాట‌ర్ ఫోటోలు తీయ‌వ‌చ్చు. అందుకు ఫోన్‌ను ఒక ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో ఉంచి దాన్ని చిత్రంలో చూపిన‌ట్టుగా గ్లాస్ నీటిలో వేయండి. టైమ‌ర్ ద్వారా ఫొటోలు తీయండి. అద్భుతంగా వ‌స్తాయి.

మీ ఫోన్ కెమెరా లెన్స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు క్లీన్ చేయండి. ఎరేజ‌ర్‌ను వాడి ఆ లెన్స్‌ను క్లీన్ చేస్తే అవి శుభ్రంగా అవుతాయి. దీంతో ఫొటోలు బాగా వ‌స్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM