Coconut Water : ఎక్కువగా చాలామంది నీళ్లతో పాటుగా, ఇతర లిక్విడ్స్ ని కూడా తీసుకుంటారు. వేసవికాలం వచ్చిందంటే, కొబ్బరినీళ్ళని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే, ఆరోగ్య పరిస్థితులను బట్టి, కొబ్బరి నీళ్లు తీసుకోవడం మంచిది. కొంత మందికి కొబ్బరి నీళ్లు తీసుకోవడం వలన హాని కలుగుతుంది. మేలు కంటే కూడా వాళ్ళకి ఇబ్బందులే కలుగుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు, కొబ్బరినీళ్ళకి దూరంగా ఉండటమే మంచిది. కొబ్బరి నీళ్లు తాగితే, శరీరం కూల్ అవుతుంది. అధిక వేడి వలన వచ్చే సమస్యల్ని దూరం చేస్తుంది.
కొబ్బరి నీళ్లని కొన్ని సమస్యలు ఉన్నప్పుడు, ఎక్కువ పరిమాణంలో తాగడం వలన అనేక ఇబ్బందులు కలుగుతాయి. నష్టాలే ఎదుర్కోవాలి. మరి కొబ్బరినీళ్ళని ఎవరు తీసుకోకూడదు, ఏ సమయంలో తీసుకోవడం మంచిది కాదు అనేది తెలుసుకుందాం. అతి సారంతో బాధపడే వాళ్ళు, కొబ్బరినీళ్ళని తీసుకోకూడదు. దీంతో ఉదర సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కచ్చితంగా ఆ సమస్యలతో బాధపడే వాళ్ళు కొబ్బరినీళ్ళని తీసుకోకుండా ఉండడం మంచిది.
జలుబుతో బాధపడే వాళ్ళు కూడా కొబ్బరినీళ్ళకి దూరంగా ఉండాలి. జలుబు, దగ్గుతో బాధపడే వాళ్ళు, అస్సలు కొబ్బరినీళ్ళని ముట్టుకోవద్దు. అధిక రక్తపోటు తో బాధపడే వాళ్ళు కూడా కొబ్బరినీళ్ళని తీసుకోవద్దు. రక్తపోటు కి సంబంధించి మందులు వాడుతున్నట్లయితే, కచ్చితంగా డాక్టర్ని సంప్రదించి, ఆ తర్వాత కొబ్బరినీళ్ళని తీసుకోండి.
శస్త్ర చికిత్స చేయించుకునే వాళ్ళు కూడా కొబ్బరినీళ్ళని తీసుకోకూడదు. వైద్యుల్ని సంప్రదించి మాత్రమే తీసుకోండి. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు కూడా కొబ్బరినీళ్లు తీసుకోకూడదు. పొత్తికడుపు ఉబ్బరంతో బాధపడే వాళ్ళు, కొబ్బరినీళ్ళకి దూరంగా ఉండటం మంచిది. ఇక ఏ సమయంలో తీసుకుంటే మంచిదనే విషయానికి వచ్చేస్తే, కొబ్బరి నీళ్ళని ఉదయాన్నే తీసుకుంటే మంచిది. ప్రతిరోజు రెండు నుండి మూడు కప్పుల కొబ్బరి నీళ్ల ని తీసుకోవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…