Banana : అరటి పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వాటితో మనకు పలు కీలక పోషకాలు అందుతాయి. పలు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే అరటి పండు ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ అందరూ దాన్ని తినకూడదు. కేవలం కొంత మంది మాత్రమే తినాలి. ముఖ్యంగా కింద చెప్పిన అనారోగ్య సమస్యలు ఉన్నవారు అరటి పండ్లను తినకూడదు. దాన్ని ఆహారం నుంచి తొలగించాలి. మరి ఏయే అనారోగ్య సమస్యలు ఉన్నవారు అరటి పండును తినకూడదో ఇప్పుడు తెలుసుకుందామా.
అధిక బరువు ఉన్న వారు, స్థూలకాయులు అరటి పండ్లను తినకూడదు. తింటే అందులో ఉండే కార్బొహైడ్రేట్లు వారిలో అధికంగా కొవ్వును ఉత్పత్తి చేస్తాయి. దీంతో ఇంకా ఎక్కువ బరువు పెరుగుతారు. కనుక అధిక బరువు ఉన్నవారు అరటి పండ్లను తినరాదు. హైపర్ కలేమియా వ్యాధి ఉన్నవారు కూడా అరటి పండ్లను తినరాదు. తింటే గుండె సంబంధ సమస్యలు వస్తాయి. బీపీ పెరుగుతుంది. ఎల్లప్పుడూ టెన్షన్, ఆందోళనతో ఉంటారు. అరటి పండ్లలో థయామిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మైగ్రేన్ ఉన్నవారికి మంచిది కాదు. దీని వల్ల తలనొప్పి ఇంకా ఎక్కువవుతుంది. అది నాడుల డ్యామేజ్‌కు దారి తీస్తుంది. కనుక మైగ్రేన్ ఉన్నవారు అరటి పండ్లను తినరాదు.
మధుమేహం ఉన్నవారు అరటి పండ్లను తింటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. మళ్లీ ఆ స్థాయిలు తగ్గాలంటే అందుకు లివర్, మూత్రపిండాలపై అధిక భారం పడుతుంది. కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండ్లను తినకపోవడమే మంచిది. లేదంటే చక్కెర స్థాయిలు పెరిగి తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలర్జీ సమస్య ఉన్నవారు అరటిపండ్లను తినరాదు. తింటే ముఖం, ఇతర శరీర భాగాలు ఉబ్బినట్టు కనిపిస్తాయి. దురద కూడా ఉంటుంది. కనుక అలాంటి వారు అరటిపండ్లను మానేయాలి. మూత్రపిండాలు, మూత్రాశయ సమస్యలతో బాధపడుతున్నవారు అరటిపండ్లను తినకపోవడమే మంచిది. ఎందుకంటే అరటిపండ్లలో ఉండే పొటాషియం కిడ్నీలపై భారం పెంచుతుంది. దీంతో కిడ్నీలు త్వరగా పాడైపోయేందుకు అవకాశం ఉంటుంది. కనుక వీరు కూడా అరటి పండ్లను తినరాదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…