గ్రీన్‌ టీని ఎక్కువగా తాగుతున్నారా ? అధికంగా సేవిస్తే ప్రమాదం.. రోజుకు ఎన్ని కప్పుల గ్రీన్‌ టీని తాగాలో తెలుసుకోండి..!

July 10, 2021 2:13 PM

గ్రీన్‌ టీని రోజూ తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. గ్రీన్‌ టీని తాగితే అధిక బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే గ్రీన్‌ టీ మనకు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ దాన్ని రోజూ ఎక్కువగా తాగరాదు. రోజుకు పరిమిత మోతాదులోనే గ్రీన్‌ టీని తాగాల్సి ఉంటుంది.

taking green tea excessively can cause side effects know the limit

గ్రీన్‌ టీని అధికంగా తాగితే శరీరంపై దుష్ప్రభావాలను చూపిస్తుంది. గ్యాస్‌, అసిడిటీ పెరుగుతాయి. నిద్రలేమి సమస్య వస్తుంది. గుండె అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది. కనుక గ్రీన్‌ టీని రోజూ పరిమిత మోతాదులోనే తాగాల్సి ఉంటుంది.

సైంటిస్టులు చెబుతున్న ప్రకారం రోజుకు రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్‌ టీని తాగవచ్చు. అంతకు మించి తాగితే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలగకపోగా అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక గ్రీన్‌ టీని ఎక్కువగా సేవించే వారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవడం మంచిది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment