Carrot : రోజూ ఒక క్యారెట్ తింటే.. ఎన్ని వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా..?

May 8, 2023 7:12 PM

Carrot : ఆరెంజ్ కలర్ లో నిగనిగలాడే క్యారెట్ గురించి మనలో చాలా మందికి తెలుసు. క్యారెట్ లో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొంత మంది క్యారెట్ ను తినటానికి ఇష్టపడరు. అయితే ఇది చదివితే మాత్రం తప్పనిసరిగా తింటారు. రోజుకొక క్యారెట్ తింటే ఎన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చో చూడండి. క్యారెట్‌లో కాల్షియం, కాపర్‌, పొటాషియం, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్‌ కూడా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్‌‌ సమృద్దిగా ఉంటాయి. క్యారెట్‌లో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌, పైరిడాక్సిన్‌, థయామిన్‌ వంటివి జీవక్రియల‌ను స‌క్రమంగా నిర్వ‌ర్తించేలా చూస్తాయి. క్యారెట్ లో ఉండే విటమిన్ ఎ కంటి చూపు మెరుగుపరచటానికి సహాయపడుతుంది.

విటమిన్ సి కణాల ఆరోగ్యానికి, దంతాలు, చిగుళ్ల సంరక్షణకు సహాయపడటమే కాకుండా శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. క్యారెట్‌లో ఉండే అత్యధిక కెరోటినాయిడ్స్, ఆల్ఫా కెరోటిన్, లూటిన్‌లు గుండెకు సంబందించిన సమస్యల‌ను రాకుండా చూస్తాయి. క్యారెట్ లో ఉండే సోడియం రక్తపోటును కంట్రోల్ చేయటంలో సహాయపడుతుంది. పొటాషియం రక్త నాళాల ఉద్రిక్తతను తగ్గిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణ పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఫాల్కరినల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ క్యాన్సర్ పై పోరాటం చేస్తుంది. రక్తహీనత సమస్యకు చెక్ పెట్టాలంటే రోజు ఒక క్యారెట్ తినాలి.

taking a carrot daily can stop these diseases
Carrot

క్యారెట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ శరీరంలోని విషాలను బయటకు పంపటంలో సహాయపడతాయి. కాలేయంలో కొవ్వు చేరకుండా క్యారెట్ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. మీ వయసు 30 దాటితే ప్రతి రోజూ కచ్చితంగా క్యారెట్ తినడం మంచిది. ప్రతి రోజు ఒక పచ్చి క్యారెట్ తినవచ్చు, లేదంటే జ్యూస్ చేసుకొని తాగవచ్చు. కాస్త అలసటగా ఉన్నప్పుడు ఒక క్యారెట్ తింటే తక్షణ శక్తి లభిస్తుంది. రక్తహీనత సమస్యను తగ్గించటానికి సహాయ పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా రోజు ఒక క్యారెట్ తినండి. దీంతో ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment