Cashew Mango : ఈ పండ్లను తీసుకుంటే.. జీవితంలో క్యాన్సర్ రాదు..!

August 17, 2023 12:01 PM

Cashew Mango : చాలామంది అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అనారోగ్య సమస్యలు ఏమీ కలగకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవడంతోపాటు కొన్ని విషయాలని ఆచరించాలి. వీటిని పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది. చాలామంది ఈ రోజుల్లో క్యాన్సర్ తో బాధపడుతున్నారు. క్యాన్సర్ వలన ఇబ్బంది పడకుండా, క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడాలంటే వీటిని తీసుకోండి.

జీడి మామిడి పండ్లు తీసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ పండ్లను చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. జీడి మామిడిపండ్లలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ర‌క్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోకుండా చూస్తుంది జీడి మామిడిపండు. మెద‌డు క‌ణాల‌ను కూడా ర‌క్షిస్తుంది ఈ పండు. జీడి మామిడిపండ్లలో ఉండే ఫైటో కెమికల్స్ క్యాన్సర్ రాకుండా చేయగలవు. క్యాన్సర్ కణాలని దెబ్బతీయగలవు. దీంతో క్యాన్సర్ బారిన పడకుండా ఉండ‌వ‌చ్చు.

take this fruit Cashew Mango to prevent cancer
Cashew Mango

స్టడీ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. జీడి మామిడిపండును తీసుకోవడం వలన క్యాన్సర్ ప్రమాదం ఉండదని, క్యాన్సర్ బారిన పడకుండా జీడి మామిడి పండు సహాయం చేస్తుందని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు కూడా జీడి మామిడి పండ్లను తీసుకోవచ్చు. అలాగే క్యాన్సర్ కి సంబంధించిన ట్రీట్ మెంట్లు తీసుకునే వాళ్ళు కూడా ఈ పండుని తీసుకోవచ్చ‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి అనేక లాభాలని ఈ జీడి మామిడిపండు అందిస్తోంది కాబట్టి కచ్చితంగా జీడి మామిడి పండ్లను తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా ఇవి ఏడాదికి ఒకసారి మాత్రమే దొరుకుతాయి. కాబట్టి దొరికినప్పుడు తీసుకోండి.

నూనె ఎక్కువగా తీసుకునే వాళ్ళు, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకునే వాళ్ళు, ముఖ్యంగా జీడి మామిడి పండ్లను తీసుకుంటే మంచింది. భోజనం తిన్నాక తీసుకున్నట్లయితే జీడిమామిడి పండు అవి శోషించుకోకుండా చూసుకుంటుంది. 90 శాతం వ‌రకు శోష‌ణ‌ అవ్వకుండా చూస్తుంది. ఇలా జీడి మామిడి పండ్లతో ఈ లాభాలను పొంది అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment