Fish : చేపలను తినడం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. చేపల్లో మన శరీరానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ మనకు చేపల ద్వారా లభిస్తాయి. ఈ క్రమంలోనే తరచూ చేపలను తినాలని వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే చేపలను తింటే అధిక బరువు తగ్గవచ్చా, లేదా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి చేపలు నిజంగానే బరువు తగ్గేందుకు దోహదపడతాయా..? చేపలను తింటే బరువు తగ్గుతారా..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
చేపలను తినడం వల్ల అధిక బరువు తగ్గవచ్చని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తేలింది. అయితే వారంలో ఒకటి, రెండు సార్లు చేపలను తినడం కాదు.. నిత్యం చేపలను తినాల్సిందే. రోజూ 140 గ్రాముల మోతాదులో చేపలను తింటే అధిక బరువు తగ్గుతారని సైంటిస్టులు చెబుతున్నారు. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. అందువల్ల బరువు తగ్గుతారు.
ఇక చేపల్లో ఆరోగ్యకరమైన ప్రోటీన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి మన ఆకలిని నియంత్రిస్తాయి. అందువల్ల తక్కువ ఆహారం తీసుకుంటాం. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. అలాగే కండరాల నిర్మాణం కూడా జరుగుతుంది. ఈ ప్రక్రియలో కూడా శరీరంలో కొంత కవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. అందువల్ల చేపలను తింటే అధిక బరువు కచ్చితంగా తగ్గుతారని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే రోజూ చేపలను తినడం వీలు కాదు కనుక.. వారంలో కనీసం ఒక్కసారైనా తింటే ఎంతో కొంత ప్రయోజనం పొందవచ్చని అంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…