Sesame Seeds : నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. తెలుపు రంగు నువ్వులు, నలుపు రంగు నువ్వులు మనకి లభిస్తూ ఉంటాయి. నువ్వులను రోజువారీ వంటల్లో తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి వీలవుతుంది. నిజానికి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన మన ఆరోగ్యం ఇంకాస్త మెరుగు పడుతుంది.
ఆహారంలో నువ్వులను చేర్చుకోవడం వలన చక్కటి ప్రయోజనాలని పొందవచ్చు. నువ్వులని మనం వివిధ రకాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. నువ్వులని పొడి కింద చేసుకోవచ్చు. నువ్వులను ఉండలుగా చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా నువ్వులకి ప్రత్యేక స్థానం ఉంది. పోషకాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి.
తెల్ల నువ్వులలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. నువ్వుల నూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ ఉంటాయి. నువ్వులలో డైరీ ప్రోటీన్ తోపాటు నాణ్యమైన ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్ డైట్ తీసుకునే వాళ్ళు కచ్చితంగా నువ్వులను తీసుకోవడం మంచిది. సలాడ్స్ వంటి వాటిలో కూడా మీరు నువ్వులను వేసుకోవచ్చు. నువ్వులలో మెగ్నీషియంతోపాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. నువ్వుల నూనె మధుమేహాన్ని నివారిస్తుంది.
మధుమేహం ఉన్నవాళ్లు రెగ్యులర్ గా నువ్వులను తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. రక్తపోటు ఉన్నవాళ్లు కూడా నువ్వులను తీసుకోవడం మంచిది. రక్తపోటుని ఇది తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడానికి కూడా నువ్వులు సహాయపడతాయి. నువ్వులలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.
డిప్రెషన్, టెన్షన్ వంటి బాధలు ఉండవు. నువ్వులను తీసుకుంటే రక్తహీనత సమస్య నుండి కూడా బయటపడొచ్చు. ఆర్థరైటిస్, ఎముకల ఆరోగ్యం, కాలేయ ఆరోగ్యం, కంటి ఆరోగ్యం, నోటి ఆరోగ్యం, శ్వాస కోశ ఆరోగ్యం కోసం కూడా నువ్వులు మనకి ఎంతగానో పని చేస్తాయి. కనుక వీలైనంత వరకు రెగ్యులర్ గా నువ్వులను తీసుకోవడానికి ప్రయత్నించండి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…