Blackspots On Tongue : నాలుక మన మొత్తం ఆరోగ్యానికి సూచిక. నాలుక ద్వారా మనం రుచిని తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఒంట్లో బాగోలేక డాక్టర్ దగ్గరికి వెళ్తే నాలుకని చూస్తారు డాక్టర్లు. నాలుక ఆరోగ్యం, నాలుక రంగును బట్టి అనారోగ్య సమస్యల్ని తెలుసుకుంటారు. నాలుక మీద ఆహారం పేరుకుపోయి బ్యాక్టీరియా పేరుకుపోతుంది. అందుకే నాలుకని ఎప్పుడు కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. సాధారణంగా మన నాలుక గులాబీ రంగులో ఉంటుంది.
ఒకవేళ కనుక నాలుక ఎర్ర రంగులో ఉన్నట్లయితే జీర్ణ సమస్యలు ఉన్నట్లు గ్రహించాలి. కొంతమందికి నాలుక మీద నల్లని మచ్చలు కూడా ఉంటాయి. ఈ మచ్చలు నాలుక ముందు, లేదంటే మధ్యలో కనబడుతుంటాయి. మృత కణాలు, బ్యాక్టీరియా, ఆహార పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం వలన నాలుకపై ఇలాంటి మచ్చలు వస్తాయి. అలాగే రక్తాన్ని అందించడానికి శరీర కణజాలంలో తగినంత ఆక్సిజన్ లేకపోతే కూడా ఇలాంటి మచ్చలు నాలుక మీద వస్తాయి.
ఈ మచ్చల్ని వదిలించుకోవడానికి మీరు వీటిని ప్రయత్నం చేయవచ్చు. ఇలా చేస్తే నాలుక మీద ఉండే మచ్చలు తొలగిపోతాయి. నాలుక మీద నల్ల మచ్చలను తొలగించడానికి దాల్చిన చెక్క, లవంగాలు బాగా ఉపయోగపడతాయి. దాల్చిన చెక్క, లవంగాలని తీసుకొని ఒక గ్లాసు నీటిలో బాగా మరిగించి చల్లారబెట్టండి. ఈ నీటితో మీరు నోరు పుక్కిలించుకుంటే సరిపోతుంది. నల్ల మచ్చలు పోతాయి.
నాలుక మీద నల్ల మచ్చలు తొలగి పోవాలంటే కలబంద రసం తీసుకుంటూ ఉండండి. అప్పుడు ఈ మచ్చలు పోతాయి. పైనాపిల్ తింటే కూడా కొద్ది రోజుల్లో నల్ల మచ్చలు తేలికగా నాలుక మీద నుండి తొలగిపోతాయి. వేప కూడా ఇందుకు చాలా చక్కగా పనిచేస్తుంది. ఒక కప్పు నీళ్లలో కొన్ని వేపాకులను వేసి బాగా మరిగించండి. తర్వాత ఈ నీటితో మీరు నోటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మచ్చలు తొలగిపోతాయి. నాలుక మీద నల్ల మచ్చల్ని తొలగించేందుకు ఒక వెల్లుల్లి రెబ్బని ఆ మచ్చల మీద రుద్దండి. సులభంగా మచ్చలు పోతాయి.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…