Blackspots On Tongue : నాలుక మీద నల్ల మచ్చలు ఉన్నాయా..? ఇలా సులభంగా తొలగించ‌వచ్చు..!

September 20, 2023 1:35 PM

Blackspots On Tongue : నాలుక మన మొత్తం ఆరోగ్యానికి సూచిక. నాలుక ద్వారా మనం రుచిని తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఒంట్లో బాగోలేక డాక్టర్ దగ్గరికి వెళ్తే నాలుకని చూస్తారు డాక్టర్లు. నాలుక ఆరోగ్యం, నాలుక రంగును బట్టి అనారోగ్య సమస్యల్ని తెలుసుకుంటారు. నాలుక మీద ఆహారం పేరుకుపోయి బ్యాక్టీరియా పేరుకుపోతుంది. అందుకే నాలుకని ఎప్పుడు కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. సాధారణంగా మన నాలుక గులాబీ రంగులో ఉంటుంది.

ఒకవేళ కనుక నాలుక ఎర్ర రంగులో ఉన్నట్లయితే జీర్ణ సమస్యలు ఉన్నట్లు గ్రహించాలి. కొంతమందికి నాలుక మీద నల్లని మచ్చలు కూడా ఉంటాయి. ఈ మచ్చలు నాలుక ముందు, లేదంటే మధ్యలో కనబడుతుంటాయి. మృత కణాలు, బ్యాక్టీరియా, ఆహార పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం వలన నాలుకపై ఇలాంటి మచ్చలు వస్తాయి. అలాగే రక్తాన్ని అందించడానికి శరీర కణజాలంలో తగినంత ఆక్సిజన్ లేకపోతే కూడా ఇలాంటి మచ్చలు నాలుక మీద వస్తాయి.

Blackspots On Tongue follow these home remedies
Blackspots On Tongue

ఈ మచ్చల్ని వదిలించుకోవడానికి మీరు వీటిని ప్రయత్నం చేయవచ్చు. ఇలా చేస్తే నాలుక మీద ఉండే మచ్చలు తొలగిపోతాయి. నాలుక మీద నల్ల మచ్చలను తొలగించడానికి దాల్చిన చెక్క‌, లవంగాలు బాగా ఉపయోగపడతాయి. దాల్చిన చెక్క‌, లవంగాలని తీసుకొని ఒక గ్లాసు నీటిలో బాగా మరిగించి చల్లారబెట్టండి. ఈ నీటితో మీరు నోరు పుక్కిలించుకుంటే సరిపోతుంది. నల్ల మచ్చలు పోతాయి.

నాలుక మీద నల్ల మచ్చలు తొలగి పోవాలంటే కలబంద రసం తీసుకుంటూ ఉండండి. అప్పుడు ఈ మచ్చలు పోతాయి. పైనాపిల్ తింటే కూడా కొద్ది రోజుల్లో నల్ల మచ్చలు తేలికగా నాలుక మీద నుండి తొలగిపోతాయి. వేప కూడా ఇందుకు చాలా చక్కగా పనిచేస్తుంది. ఒక కప్పు నీళ్లలో కొన్ని వేపాకులను వేసి బాగా మరిగించండి. తర్వాత ఈ నీటితో మీరు నోటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మచ్చలు తొలగిపోతాయి. నాలుక మీద నల్ల మచ్చల్ని తొలగించేందుకు ఒక వెల్లుల్లి రెబ్బని ఆ మచ్చల మీద రుద్దండి. సులభంగా మచ్చలు పోతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment