Orange : నారింజ పండ్లను చాలామంది తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. నారింజ పండ్లు పుల్లగా ఉన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నారింజ పండ్లలో పోషకాలు బాగా ఎక్కువగా ఉంటాయి. మనం నారింజ జ్యూస్ వంటి వాటిని చేసుకోవచ్చు. నారింజ పండ్లను తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. మరి నారింజ పండ్లతో ఎలాంటి లాభాలను పొందవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
నారింజ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడానికి కూడా నారింజ పండ్లు బాగా ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యాన్ని కూడా నారింజ పండ్లు మెరుగుపరుస్తాయి. నారింజ పండ్లలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. బీటా కేరోటిన్, పొటాషియం, మెగ్నీషియంతోపాటు ఫైబర్ కూడా వీటిలో ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి కూడా ఈ పండ్లలో ఎక్కువగా ఉంటుంది.
నారింజ పండ్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వాళ్లకు కూడా ఈ పండు బాగా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని కూడా ఈ పండు పెంచుతుంది. యాంటీ వైరల్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతోపాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఇందులో ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులను నివారించేందుకు ఈ పండు సహాయం చేస్తుంది. ఈ పండును తీసుకున్నా లేదంటే జ్యూస్ కింద చేసుకుని తీసుకున్నా ఎన్నో లాభాలు ఉంటాయి.
కాబట్టి వీలైనప్పుడల్లా ఈ పండ్లను తీసుకుంటూ ఉండండి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. చర్మ వృద్ధాప్యాన్ని నివారించగలదు. ఇది చర్మాన్ని కూడా ఆరోగ్యంగా మారుస్తుంది. ఈ పండును తీసుకుంటే చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. రక్తపోటుని కూడా ఈ పండు కంట్రోల్ చేస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువ ఉంటుంది. రక్తపోటుని నియంత్రించడంలో సహాయం చేస్తుంది.
గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్స్ ఇందులో పుష్కలంగా వుంటాయి. రక్తం గడ్డ కట్టకుండా నివారించి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్ల ప్రమాదం నుండి కూడా ఇది బయట పడేస్తుంది. ఇలా అనేక లాభాలని నారింజపండు ద్వారా పొందొచ్చు. కానీ ఎక్కువగా నారింజ పండ్లని తీసుకోవడం వలన గుండెలో మంట కలిగే అవకాశం ఉంటుంది. పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాళ్లు డాక్టర్‌ని కన్సల్ట్ చేసి నారింజ పండ్లను తీసుకోవడం మంచిది. ఎక్కువగా నారింజ పండ్లను తీసుకుంటే దంత క్షయం కలగవచ్చు. రోజుకి ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ తినకండి.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…