Over Sleep : మనం రోజూ వేళకు తినడం, వ్యాయామం చేయడం వల్ల ఎంతటి మేలు జరుగుతుందో అందరికీ తెలిసిందే. దీంతోపాటు మనకు నిద్ర కూడా అవసరమే. ప్రతి వ్యక్తి కనీసం 6 నుంచి 8 గంటల పాటు అయినా సరే నిద్రించాలని సైంటిస్టులు చెబుతున్నారు. నిద్ర సరిపోకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. ప్రస్తుత తరుణంలో ఉరుకుల పరుగుల బిజీ జీవితం వల్ల చాలా మంది టైముకు నిద్రించడం లేదు. దీంతో అనేక అనర్థాలను కొని తెచ్చుకుంటున్నారు.
ఇక మీరు పైన పెట్టిన టైటిల్ చూడగానే భయపడిపోయి ఉంటారు. కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి. ఆ చేదును భరించడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇది కూడా అంతే. ఆరోగ్యానికి నిద్ర ఎంత కీలకమో.. అతి నిద్ర అంతే హానికరమట. ఇదేదో మేం చెబుతున్నది కాదు.. తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా మందికి నిద్రంటే చాలా ఇష్టం. ఎంతసేపు పడుకోమన్నా అలాగే పడుకుంటారు. కానీ.. అటువంటి వాళ్లు మాత్రం ఇప్పుడైనా కాస్త ఆలోచించాల్సిందే. లేదంటే ఎప్పుడు చనిపోతామనేది తెలియదని సైంటిస్టులు చెబుతున్నారు. నిద్ర సరిగా లేకపోతే ఎటువంటి సమస్యలు వస్తాయో.. అతిగా నిద్రపోయినా అలాంటి సమస్యలే వస్తాయని అంటున్నారు.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏమంటోందంటే.. రోజుకు 9 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోతే అకాల మరణం ముప్పు ఎక్కువగా ఉంటుందని తేల్చేసింది. ఇంకా 10 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోయేవారిలో 33 శాతం మంది త్వరగా చనిపోతారట. అంతే కాదు.. గుండెకు సంబంధించిన సమస్యలు 10 గంటల కంటే ఎక్కువగా నిద్రపోయేవాళ్లకే ఎక్కువగా వస్తాయట. వామ్మో.. నిద్ర తక్కువ పోయినా కష్టమే.. ఎక్కువ పోయినా కష్టమే.. కనుక తగినంత నిద్రించాలి. ఏదైనా సరే మరీ అతి పనికిరాదు.. అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. లేదంటే అనారోగ్యాలను స్వాగతించినట్లే అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…