Over Sleep : రోజూ అతిగా నిద్ర‌పోతున్నారా..? అయితే ఎలాంటి అన‌ర్థాలు జ‌రుగుతాయో తెలుసా..?

February 22, 2023 5:35 PM

Over Sleep : మ‌నం రోజూ వేళ‌కు తిన‌డం, వ్యాయామం చేయ‌డం వ‌ల్ల ఎంత‌టి మేలు జ‌రుగుతుందో అంద‌రికీ తెలిసిందే. దీంతోపాటు మ‌న‌కు నిద్ర కూడా అవ‌స‌ర‌మే. ప్ర‌తి వ్య‌క్తి క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు అయినా స‌రే నిద్రించాలని సైంటిస్టులు చెబుతున్నారు. నిద్ర స‌రిపోక‌పోతే అనారోగ్య స‌మ‌స్య‌లు వస్తాయ‌ని అంటున్నారు. ప్ర‌స్తుత త‌రుణంలో ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం వ‌ల్ల చాలా మంది టైముకు నిద్రించ‌డం లేదు. దీంతో అనేక అనర్థాల‌ను కొని తెచ్చుకుంటున్నారు.

ఇక మీరు పైన పెట్టిన టైటిల్ చూడగానే భయపడిపోయి ఉంటారు. కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి. ఆ చేదును భరించడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇది కూడా అంతే. ఆరోగ్యానికి నిద్ర ఎంత కీలకమో.. అతి నిద్ర అంతే హానికరమట. ఇదేదో మేం చెబుతున్నది కాదు.. తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా మందికి నిద్రంటే చాలా ఇష్టం. ఎంతసేపు పడుకోమన్నా అలాగే పడుకుంటారు. కానీ.. అటువంటి వాళ్లు మాత్రం ఇప్పుడైనా కాస్త ఆలోచించాల్సిందే. లేదంటే ఎప్పుడు చ‌నిపోతామనేది తెలియదని సైంటిస్టులు చెబుతున్నారు. నిద్ర సరిగా లేకపోతే ఎటువంటి సమస్యలు వస్తాయో.. అతిగా నిద్రపోయినా అలాంటి సమస్యలే వస్తాయ‌ని అంటున్నారు.

Over Sleep can cause many health problems know them
Over Sleep

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏమంటోందంటే.. రోజుకు 9 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోతే అకాల మరణం ముప్పు ఎక్కువగా ఉంటుందని తేల్చేసింది. ఇంకా 10 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోయేవారిలో 33 శాతం మంది త్వరగా చనిపోతారట. అంతే కాదు.. గుండెకు సంబంధించిన సమస్యలు 10 గంటల కంటే ఎక్కువగా నిద్రపోయేవాళ్లకే ఎక్కువగా వస్తాయట. వామ్మో.. నిద్ర తక్కువ పోయినా కష్టమే.. ఎక్కువ పోయినా కష్టమే.. క‌నుక త‌గినంత నిద్రించాలి. ఏదైనా స‌రే మ‌రీ అతి ప‌నికిరాదు.. అనే విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ గుర్తుంచుకోవాలి. లేదంటే అనారోగ్యాల‌ను స్వాగతించిన‌ట్లే అవుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment