Oil For Hair Growth And Dandruff : జుట్టు ఒత్తుగా పెర‌గాల‌న్నా.. చుండ్రు త‌గ్గాల‌న్నా.. దీన్ని వాడండి..!

October 8, 2023 7:58 AM

Oil For Hair Growth And Dandruff : ప్రతి ఒక్కరు కూడా, అందమైన కురులని పొందాలని అనుకుంటుంటారు. మీరు కూడా అందమైన కురులని పొందాలని అనుకుంటున్నారా..? పొడవాటి జుట్టుని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే, ఇది మీకోసం. జుట్టుకి సంబంధించిన సమస్యలు తగ్గించడానికి, ఖరీదైన నూనెలు, షాంపులు వాడక్కర్లేదు. చాలామంది రేటు ఎక్కువ పెట్టి, మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని కూడా వాడుతూ ఉంటారు. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి, కురులు బలంగా ఉండడానికి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

జుట్టుకు రక్తప్రసరణ మెరుగుపరచడానికి, ఈ నూనెను తయారు చేసుకోండి ఈ నూనెను తయారు చేసుకుని, మీరు ఉపయోగించినట్లయితే, కుదళ్లకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. జుట్టు అస్సలు రాలదు కూడా. ఒక గిన్నెలో ఐదు ఉసిరికాయల్ని తురుముకోండి. తర్వాత, అందులో గుప్పెడు గోరింటాకు, గుప్పెడు కట్ చేసిన మందార ఆకులు వేసుకోండి.

Oil For Hair Growth And Dandruff how to use this
Oil For Hair Growth And Dandruff

అలానే, ఇందులోనే 100 గ్రాములు మెంతులు, రెండు స్పూన్లు కలోంజీ గింజలు వేసుకోండి. గుప్పెడు కరివేపాకు ఆకులను కూడా వేసుకోండి. అరకేజీ కొబ్బరి నూనెను కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు, పొయ్యి మీద పెట్టి సిమ్ లో వీటన్నిటిని మరిగించుకోవాలి. ఈ పదార్థాలు అన్నిటినీ కలుపుతూ, నల్లగా నూనె వచ్చే వరకు కూడా మరిగించుకోండి. ఈ నూనెని తర్వాత వడకట్టేసి స్టోర్ చేసుకోండి.

ప్రతి రోజు తలకి నూనె ని రాసుకుంటూ, మసాజ్ చేసుకోండి. జుట్టు రాలకుండా ఉంటుంది. జుట్టు బాగా పొడుగ్గా ఎదుగుతుంది. నల్లగా కూడా మారుతుంది. చర్మం ఇన్ఫెక్షన్ కి గురి కాకుండా ఉంటుంది. చుండ్రు సమస్య కూడా ఉండదు. ఈ నూనెని మీరు దాదాపు రెండు నెలల వరకు నిల్వ పెట్టుకోవచ్చు. ఈ నూనె ని వాడితే, రక్తప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టు బాగా ఎదుగుతుంది. జుట్టు రాలడం, చుండ్రు వంటి బాధల నుండి సులభంగా బయటపడొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now